10. కురరహస్తలక్షణమ్
| కురరాఖ్యే౽పవిద్ధాఖ్యోసూచిరేవ ప్రయుజ్యతే, | |
తా. సూచిహస్తము అపవిద్ధముగఁ బట్టఁబడినయెడ కురరపక్షియందు చెల్లును.
11. శుకహస్తలక్షణమ్
| శుకతుండః ప్రయోక్తవ్యః శుకార్థే పుఙ్ఖితాకృతిః. | 702 |
తా. శుకతుండహస్తమును పుంఖితాకారముగఁ బట్టినయెడ చిలుకయందు వినియోగించును.
12. సారసహస్తలక్షణమ్
| ముకుళేతు కనిష్ఠాపి కిఞ్సిద్వక్రితభావతః, | 703 |
తా. ముకుళహస్తమునందలి చిటికెనవేలు కొంచెము వంకరగా పట్టబడినయెడ ప్రదేశముకుళహస్త మౌను. ఇది సారసపక్షియందు వినియోగించును.
13. బకహస్తలక్షణమ్
| తర్జన్యంగుష్ఠసంయోగే మధ్యమా౽నామికాపిచ, | 704 |
| నామ్నాసఙ్కీర్ణహంసో౽యం శుక్రాచార్యమతోదితః, | 705 |
తా. తర్జన్యంగుష్ఠములను జేర్చి మధ్యమానామికలను చాఁచి కనిష్ఠను అరచేతిలో మడిచిపెట్టినయెడ సంకీర్ణహంసహస్త మగును. ఇది శుక్రాచార్యునిమతము. ఈహస్తము కొంగయందును మంత్రభేదమునందును చెల్లును.
14. క్రౌఞ్చపక్షిహస్తలక్షణమ్
| పూర్వాలపద్మహస్తేతు కనిష్ఠాతలకుఞ్చితా, | |