తా. అర్ధచంద్రహస్తములను అధోముఖములుగ మనికట్లు చేరఁబట్టి వ్రేళ్లను విరళములుగాఁ జేసినయెడ స్వస్తికచంద్రహస్త మగును. ఇది గండభేరుండపక్షియందు వినియోగింపఁబడును.
6. చాతకహస్తలక్షణమ్
| లాఙ్గూలశ్చాతకేభూయా త్పుఙ్ఖితత్వముపాశ్రితః, | |
తా. లాంగూలహస్తమును పుంఖితముగఁ బట్టినయెడ చాతకపక్షియందు చెల్లును.
7. కుక్కుటహస్తలక్షణమ్
| పూర్వోక్తభ్రమరోభూయాత్తామ్రచూడనిరూపణే. | 699 |
తా. మునుపు చెప్పఁబడిన భ్రమరహస్తమే కోడియందు వినియోగించును.
8. కోకిలహస్తలక్షణమ్
| అరాళః పుఙ్ఖితాకారః కోకిలార్థే నియుజ్యతే, | |
తా. అరాళహస్తమును పుంఖితముగఁ బట్టినయెడ కోకిలయందు చెల్లును.
9. వాయసహస్తలక్షణమ్
| భరతార్ణవసంప్రోక్తభమరాంగుష్ఠక స్తథా. | 700 |
| అగ్రభాగేన తర్జన్యాః మిళితో యది పుఙ్ఖితః, | 701 |
తా. భరతార్ణవమందు చెప్పఁబడియుండెడి భ్రమరహస్తాంగుష్ఠమును చూపుడువ్రేలికొనతోఁ జేర్చి పుంఖితముగఁ బట్టబడినయెడ సందంశముకుళహస్త మగును. ఇది కాకియందు వినియోగించును.