19. అజహస్తలక్షణమ్
| శిఖరౌ శ్లిష్టవదనౌ మేషార్థే సమయుజ్యతే, | |
తా. శిఖరహస్తములను ముఖభాగము చేరఁబట్టినయెడ మేఁకయందు వినియోగించును.
20. గార్ధభహస్తలక్షణమ్
| పూర్వఖణ్డాజ్జలౌమిశ్రే కుఞ్చితేతర్జనీద్వయే. | 691 |
| భిన్నాంజలిరయంనామ్నా గార్దభార్థే నియుజ్యతే, | |
తా. మునుపుచెప్పిన ఖండాంజలిహస్తమందు తర్జనీద్వయమును జేర్చి వంచిపట్టినయెడ భిన్నాంజలిహస్త మవును. ఇది గాడిదయందు చెల్లును.
21. వృషభహస్తలక్షణమ్
| మధ్యమానామికే కిఞ్చిత్కుఞ్చితే తలమాశ్రితే. | 692 |
| అంగుష్టే నోపరియుతే శేషే ద్వేచ ప్రసారితే, | 693 |
తా. మధ్యమానామికలను కొంచెము అరచేతితట్టునకు వంచి వానిమీఁద అంగుష్టమును జేర్చి తక్కినరెండువ్రేళ్లను చాఁచిపట్టినయెడ తలసింహహస్త మౌను. ఇది వృషభార్థమందు వినియోగించును.
22. ధేనుహస్తలక్షణమ్
| మధ్యమావక్రితాయత్ర శేషాస్సర్వేప్రసారితాః, | 694 |
తా. నడిమివ్రేలిని వంచి తక్కినవ్రేళ్ళను చాఁచిపట్టినయెడ సంకీర్ణముద్రహస్త మౌను. ఇది ఆవునందును, యంత్రభేదమునందును చెల్లును.