ఈ పుట ఆమోదించబడ్డది
9. కృష్ణావతారహస్తలక్షణమ్
| మృగశీర్షేతు హస్తాభ్యా మన్యోన్యాభిముఖీకృతే, | 615 |
తా. రెండుమృగశీర్షహస్తములు భుజశిరస్సులసమీపమున ఎదురెదురుగా పట్టఁబడినయెడ కృష్ణావతారహస్త మగును.
10. కల్క్యవతారహస్తలక్షణమ్
| పతాకో దక్షిణే వామే త్రిపతాక కరో ధృతః, | 616 |
తా. కుడిచేత పతాకహస్తమును ఎడమచేత త్రిపతాకహస్తమును పట్టఁబడినయెడ కల్క్యవతారహస్త మగును.
11. రాక్షసహస్తలక్షణమ్
| ముఖేకరాభ్యాం శకటో రాక్షసానాం కరస్స్మృతః, | |
తా. రెండుచేతులచే ముఖమునందు శకటహస్తము పట్టఁబడెనేని రాక్షసహస్త మగును.
అథ చతుర్వర్ణహస్తా నిరూప్యంతే.
బ్రాహ్మణహస్తలక్షణమ్
| కరాభ్యాం శిఖరం ధృత్వా యజ్ఞసూత్ర ప్రదర్శనే. | 617 |
| దక్షిణేన కృతే తిర్యగ్ర్బాహ్మణానాం కరస్స్మృతః, | |
తా. రెండు శిఖరహస్తములను బట్టి కుడిచేత అడ్డముగా జన్నిదమును జూపునెడ బ్రాహ్మణహస్త మగును.