ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తేషాం మూర్తిత్రయీభావః ఋగ్యజుస్సామభిఃపురా.

413


యేన హస్తేనా౽భినీతో విధేరగ్రే యతస్తతః,
తామ్రచూడః త్రయీజాతః తస్యవజ్రాయుధో ఋషిః.

414


శఙ్ఖవర్ణో దేవజాతిరధిదేవో బృహస్పతిః,

తా. ఇది పూర్వము ఆకృతులను ధరించిన మూఁడువేదములు బ్రహ్మయెదుట నిలిచి తమ యభిప్రాయమును తెలుపునపుడు వానివలనఁ బుట్టెను. ఇది దేవజాతి. దీనికి దేవేంద్రుఁడు ఋషి. శంఖవర్ణము. బృహస్పతి అధిదేవత.

వినియోగము:—

లోకత్రయే త్రిశూలేచ త్రిసఙ్ఖ్యా గణనే౽పిచ.

415


అశ్రుసమ్మార్జనే వేదత్రయే బిల్వదళే౽పిచ
దేవజాతౌ శుభ్రవర్లే తామ్రచూడో నియుజ్యతే.

416

తా. మూఁడులోకములు, శూలాయుధము, మూఁడని లెక్కపెట్టుట, కన్నీరు తుడుచుట, మూఁడువేదములు, మారేడుపత్రి, దేవజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము వినియోగించును.

28. త్రిశూలహస్తలక్షణమ్

నికుఞ్చయిత్వా౽ఙ్గుష్ఠంతు
కనిష్ఠఞ్చ త్రిశూలకః,

తా. బొటనవ్రేలిని చిటికెనవ్రేలిని వంచి తక్కినవ్రేళ్లను చాఁచిపట్టినది త్రిశూలహస్త మనఁబడును.