తా. ముందు చెప్పిన పద్మకోశహస్తము వ్రేళ్ళను మాటిమాటికి చేర్చి విడిచిపెట్టుచుండినయెడ సందంశహస్త మగును.
వినియోగము:—
| ఉదారే బలిదానేచ వ్రణే కీటె మనోభయే, | 396 |
తా. త్యాగము, బలియిచ్చుట, పుండు, పురుగు, మనస్సునందలి భయము, అర్చించుట, అయిదు అనుట వీనియందు ఈహస్తము వినియోచును.
గ్రంథాంతరస్థ సందంశహ సలక్షణమ్.
| హంసాస్య మధ్యయా బాహ్యా యది సందంశకో భవేత్, | 397 |
| సందంశోభారతేర్జాతో ఋషిర్విశ్వావసుః స్మృతః, | 398 |
తా. హంసాస్యహస్తమందలి నడిమివ్రేలు చాఁచిపట్టినయెడ సందంశహస్త మవును. సరస్వతీదేవి అక్షమాల ధరింపఁగా నామెవలన ఈ సందంశహస్తము పుట్టెను. ఇది విద్యాధరజాతి. దీనికి ఋషి విశ్వావసుఁడు. వర్ణము గౌరము. అధిదేవత వాల్మీకి.
వినియోగము:—
| రదనేసూక్ష్మముకుళేసఙ్గీతేలాస్యనర్తనే, | 399 |
| యజ్ఞోపవీతే రేఖాయాంశోధనే చిత్రలేఖనే, | 400 |
| నికషేకనకాదీనాంశితేలక్ష్యేనఖే౽ఙ్కురే, | |