ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తిరస్కరిణ్యాం సోపానే సాక్షాత్కారే౽పిచక్రమే,
త్రిపుండ్రధారణేచైవ వితర్కేచ మృగాననే.

343


అస్మదర్థే శరీరేచ సంజ్ఞాపూర్వసమాహృతౌ,
ఋషిజాతౌ శుభ్రవర్ణే మృగశీర్షకరః స్మృతః.

344

తా. గోడ, విచారము, సమయము, నివాసస్థానము, గొడుగుపట్టుట, పద్మినీ శంఖినీ హస్తినీజాతి స్త్రీలు, మెల్లగాననుట, గందము మొదలగువాని పూఁత, స్త్రీల అభినయము, త్రిపుండ్రధారణము, వితర్కము, మృగముయొక్క మొగము, నేను అనుట, దేహము, సైగచే గ్రహించుట, ఋషిజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము ఉపయోగించును.

18. సింహముఖహస్తలక్షణమ్

మధ్యమానామికాగ్రాభ్యా
మఙ్గుష్ఠో మిశ్రితో యది,
శేషౌ ప్రసారితౌ యత్ర
స సింహముఖ ఈరితః.

345

తా. నడిమివ్రేలు ఉంగరపువ్రేలు ఈరెంటికొనలను బొటనవ్రేలితోఁ జేర్చి తక్కినవ్రేళ్ళను జాఁచిపట్టినయెడ సింహముఖహస్త మగును.

వినియోగము:—

విద్రుమే మౌక్తికేచైవ సుగన్ధే౽లకస్పర్శనే,
ఆకర్ణనేచ పృషతి మోక్షార్థే హృదిసంస్థితః.

346


హోమే శశే గజే దర్భచలనే పద్మదామని,
సింహాననే వైద్యపాకశోధనే సింహవక్త్రకః.

347