పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

34

అబలాసచ్చరిత్ర రత్నమాల.

తుల్యుఁడగు గోరాసింహుఁడును, నాతని పుత్రుఁడగు బాదలుఁడును ఆయుద్ధమునందు మృతులగుటవలన రజపూతులకు విజయానందమంతగా రుచింపదయ్యెను. అల్లా ఉద్దీను పరాజయమునకు బిసిమిల్లాయనుచుఁ దనసైనికులతో డిల్లీమార్గమునం దరలిపోయెను.

ఆయుద్ధానంతరము మఱికొంతకాలమునకు డిల్లీపతి విశేషసైన్యముతో మరల చితూరుపై దండు వెడలెను. ఈతడవ చితూరునందు శూరులు లేనందున రజపూతులకు విజయాశ యంతగా లేకయుండెను. కాని యావీరు లంతటితో నిరాశ నొంది యుండక ప్రాణములకుఁ దెగించి శత్రువులతోఁ బోరాడఁ దొడఁగిరి. అట్టిసమయమునం దొకకారణమువలన నారజపూతులకు జయము దొరకదని నిశ్చయముగాఁ దోఁచెను. అదియేది యనఁగా నాయుద్ధము జరుగునపు డొకదినమురాత్రి గ్రామదేవత భీమసింహుని స్వప్నమునం దగుపడి "నాకతి దాహముగా నున్నది. ఈదాహము పండ్రెండు గురురాజులరక్తము త్రాగినఁగాని తీరద"ని చెప్పెనఁట. అదేప్రకారము భీమసింహునిపుత్రులు పదునొకండుగురు శత్రువులతోడం బోరి హతులయిరి. అంతటితోనైనను రజపూతులు ధైర్యమును విడువక పురమునంగల పురుషులందఱును వైరులతోడంబోరి స్వర్గసుఖ మంద నిశ్చయించిరి. అంత వారందఱు సిసోదియావంశము నాశ మొందుటకు వగచి భీమసింహుని కనిష్ఠపుత్రుని నొక దాదిచేతి కిచ్చి సమీపారణ్యమునకుఁ బంపిరి. పిదప వారందఱు రాజవంశమున కంకురముగలదని నిశ్చయించుకొని సమర రంగమున కరిగిరి. ఆదిన మారజపూతుల శౌర్యాగ్ని మఱింత