పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/310

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

అబలాసచ్చరిత్ర రత్నమాల.

నభిలషించి యాయనపేరిట ధన్యకటక పురమునం దొకదేవాలయము నిర్మించెను. ఈ యుద్దేశముతోనే యీరాణి బంగారు శిఖరముగల యింకొకగుడిని గట్టించి దానిలో బేటేశ్వరుఁడను లింగమును బ్రతిష్ఠింపఁజేసెను. ఈగుడికి నైయీదేవి ఫలవంతమగు బీనదీవియనుగ్రామము నొసంగెను. ఈమహనీయురాలు ధన్యకటకపురిలో 12 గురు బ్రాహ్మణోత్తములకు 12 భూపసతులును 12 గృహములును దాన మొసంగెను. ఈమె తనతండ్రియగు గణపతిదేవుని పేర గణపేశ్వరుని (శివుని) యాలయమొకటి కట్టించెను. ఈగుడికై యీరాణిచింతపాడు గ్రామము నొసంగెను. ఈ రాణిహస్తములు సతతము శివుని నర్చించుటయందే వినియోగించెను. శివుని మాహాత్మ్యమును బ్రకటించు శ్లోకములే యామె కానందము నిచ్చుచుండెను. ఈ రాణివేదములయం దధికవిశ్వాసముకలది కావుననే విశాల రాజ్యక్లేశము కలిగియున్నను ఆనందముతో దినములు గడపెను. రెండవపార్వతి యనఁదగిన యీమె మహాత్మ్యము నెవ్వరు తగినట్టుగ వర్ణింపఁగలరు?" ఈ మహనీయురాలిచరితమును గుఱించి యింతకంటె నధిక మేమియుఁ దెలియదు కాన విధిలేక మిగులచింతతో దీనిని ముగించు చున్నదాన.