పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/256

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రఖమాబాయికి బే

రాజకార్యధురంధరత్వమునకయి ప్రఖ్యాతి గాంచి యీ సాధ్వి క్రీ. శ. 1765 వ సంవత్సరప్రాంతమున ఖాన్ దేశమునందలి పారోళే యనుగ్రామమున జన్మించెను. ఈమె తండ్రి పేరు బాళంభట్టు; తల్లిపేరు సావిత్రిబాయి. భాళ భట్టు బైక్షుకవృత్తితో జీవనము చేయుచుండెను. రఖమాబాయియొక్క బాల్యేతిహాస మేమియుఁ దెలియదు. ఈమెకుఁ దల్లిదండ్రులు భివరాభాయియని నామకరణముచేసిరి. భివరాబాయిని విఠల్ మహాదేవను నతని కిచ్చి వివాహముచేసిరి. వివాహనంతర మీమెకు రఖమాబాయి యనునామాంతరము గలిగెను. భర్త జీవితకాలమునందు నీమెబుద్ధివైభవ మంతగాఁ బ్రకాశింపకున్నను, ఈమె భర్త కనేక పర్యాయములు రాజ కార్యములయందుఁ దోడుపడెనని మాత్రము తెలియుచున్నది.

క్రీ. శ. 1826 వ సంవత్సరమున విట్ఠల్ మహాదేవ్ గతించెను. ఆయనమరణమునకుఁబూర్వమే జ్యేష్ఠపుత్రికకొమారుఁడగు గణేశవిట్ఠల్ జోగి అనుపిల్లవానిని దత్తపుత్రునిగా స్వీకరించెను. తదనంతర మల్పకాలములో మహారాజ్ మల్హారరావ్ హోళకర్ గారు గణేశవిట్ఠలునకు తమదివాన్‌గిరినిచ్చిరి. అప్పు డాయన బాలుఁడగుటవలన రాజ్యవ్యవస్థనంతను రఖమాబాయిగారే చూచుచుండిరి. అటుతరువాతఁ గొన్నిదినములకు రావ్‌జీతియంబకను నాతనిప్రోత్సాహమువలన గణేశవిట్ఠ