పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/216

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ణించెను. "ఈ కంకణము తమపత్ని కడనుండి వచ్చెను. రాణిగారి కిట్టిసంకటమేమి వచ్చినదో తెలియదు. ఆమె సంకటమును నివర్తింప తమరే దీని నెత్తెదరని యెదురు చూచుచుంటిని. కాని తాము దాని నెత్తుజాడ కానరానందున నేనెత్తవలసిన వాఁడనయితిని. అదేలననఁగా యెవ్వరును నెత్తకుండిన నింతసభయందు శూరుఁడులేన ట్లర్థమగును. కాన నేనెత్తి యిట్లు ప్రతిజ్ఞఁ జేయుచున్నాను. నాబొందిలో ప్రాణమున్నంతవఱకు రాణిగారి యిచ్ఛితకార్యమును నెరవేర్పకమానను."

సేనాపతి ప్రతిజ్ఞనువిని రాజు మనమునందు మిగుల కోపించెను. కాని యాతఁడు తనమఱఁది నేమియు ననుటకు సాహసింపఁడయ్యె. దీనినంతను గనికంకణము తెచ్చినదాని మిగుల సంభ్రమముతో రాణిగారియిచ్ఛితకార్యమును సభవారి కిట్లు నివేధించెను. "రాణిగారి యిచ్ఛితకార్యమును వినుఁడు ఈకంకణము నెత్తిన వీరపురుషుఁడు రాజావసంతరాయులను, ఆతని కుటుంబమును రక్షించుటకయి తమప్రాణ మున్నంత వఱకును బ్రయత్నింపవలయును" "ఆమె యిచ్చ ప్రకారమే జరుగున"ని యాసేనాధిపతి తనసంస్థానమునఁ గూర్చుండెను.

ఆదినము సభచాలించి రాజు రాణినగరునకు వచ్చెను. ప్రతాపాదిత్యుఁ డితరుల కెంతభయంకరుఁడయినను తనపత్ని ముందర నాభయంకరత యేమియులేక మిగుల సాత్వికుఁడుగా నుండుచుండెను. ఇదియంతయు జసరేశ్వరియొక్క నేర్పుచాతుర్యమువలననేకాని మఱివేరుకారణముచేఁగాదు. ఎట్టిదుష్టులును ఆమెను గనిన సమయమునందు శిష్టులుగా నుండుచుండిరి.