పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/94

ఈ పుట ఆమోదించబడ్డది

వంగజనని తేజోమయమగు నక్షత్రమువంటి విద్యాసాగరుడను న్యాయరత్నమును గాంచ సమర్ధురాలాయెను. తమ సంతానమునకు సద్గుణములు నేర్పుటకయి కుటుంబ మెటలుండ వలయునో నేర్చుకొన దలచినవారికి పాతూల గ్రామమునందలి విద్యావాగీశుని పరివారమే చాలినంత దృష్టాంతము. భగవతీదేవి యొక్కయు విద్యాసాగరుని యొక్కయు చరితములందు బ్రకాశించుదయ, ధర్మము మొదలగు సద్గుణములకు విద్యావాగీశుని కుటుంబమే మూలము. 1732 వ. సంవత్సరమున బనిమాలాపురమునందలి రామజయబంద్యోపాధ్యాయునిపుత్రుడగు ఠాకుర్‌దాసుని భగవతీదేవి వివాహమయ్యెను. ఈ దంపతులకే ప్రాత: సంస్మరణీయుడగు ఈశ్వరచంద్రవిద్యాసాగరుడు జన్మించెను.

ఠాకూర్‌దాసుని బాల్యమునందే యాతనితండ్రి సంసారము నందు విరక్తుడయి స్వదేశపరిత్యాగము చేసి తీర్థయాత్రలు చేయుచుండెను. కాన ఠాకూర్‌దాసుని తల్లియగు దుర్గాదేవి తన పుట్టినింటి కరుగవలసినదాయెను. అచ్చట నామెదు:ఖ మెంత మాత్రము తగ్గక, మీదుమిక్కిలి యన్నలయొక్కయు, వదినెలయొక్కయు బాధవిశేషమయ్యెను. కావున నామె యాగ్రామముననే యొకకుటీరము నిర్మించుకొని యొకవిధముగా కాలము గడుపుచుండెను. ఆమె రాత్రియంతయు దారమువడికి దాని నమ్మి తానును కొమారుడును భోజనము చేయుచుండిరి. బుద్ధిమంతుడగు ఠాకూర్‌దాసు, తల్లికష్టము చూడనోపక, కలకత్తా కరిగి యతికష్టముతో విద్య నభ్యసించెను. ఆయన త్వరగా