పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రత్యేకముగా గొన్నినాళ్లు నిలచి, వేదకాలపుస్త్రీలను గురించి కొందరు శాస్త్రులతో ముచ్చటించి, కొన్ని సంగతులను దెలిసికొనెను. తానుదహరింప దలచుకొని, మంత్రముల నిజానిజముల గనుగొనుటకు ఋగ్వేదసంహిత దొర, కక కొంతకాలము వేచియుండి, తుద కెంతయు గర్చుపెట్టి హైదరాబాదు నుండి ఋక్ సంహిత బదులు తెప్పించుకొనెను. అదియుగాక రెండు సంవత్సరములలో నీమెభర్తకు ఆరుతావులకు మార్పు గలిగినందున నీమెకు సావకాశము దొరకకుండెను. ఇట్టి కారణములచే నీ భాగము నెమ్మదిగా వ్రాయ దటస్థించి మొదటిభాగమునకు దీనికి నాల్గేండ్లు వ్యవధియయ్యను. ఇట్లు శ్రమపడి సోదరీలోకమున కమూల్యభూషణంబుగా నీ గ్రంథరాజమును సమకూర్చుచుండ, నదియైనను బూర్తిగానీక యింతలో నీదేశముయొక్క దౌర్భాగ్యదేవత మృత్యుదేవతాకారమున, దనకు గన్నెర్రగా దేజరిల్లుచున్న యీ నారీమణిని మ్రింగివేసెను. 'అబలా సచ్చరిత్ర రత్నమాల' రెండవభాగము వైదిక స్త్రీల చరిత్రములును, పౌరాణిక స్త్రీలలో ద్రౌపది, సీత ఈ రెండు చరిత్రలును మాత్రము ముగిసినవి. ఈ సతీరత్నము తానీలోకమునకు గొప్ప యాపదను సంఘటించి పరలోకము, కేగునప్పు డసంపూర్తిగా నుంచిపోయిన గ్రంథములు, ఇపుడు సావిత్రి యందు బ్రకటింపబడుచున్న "అబలాసచ్చరిత్ర రత్నమాల" రెండవభాగముగాక మరి రెండుగలవు. 1. క్రోషాఅల్లిక. 2. ఊలు అల్లిక, మొదటిది హిందూసుందరీపత్రిక కొరకును, రెండవది సరస్వతీ పత్రికకును వ్రాయబడుచుండెను. ఈ గ్రంథము లారంభించుటకు బూర్వమందువ్రాసెనో పరమందు వ్రాసెనో గాని యీమె రచించినది వేరొక శతకంబుగూడ నున్నది. ఈమె గ్రంథరచనయందు బద్యరచన యిదియొక్కటియే కానబడుచున్నది. సోదరీమణుల యుపయోగార్థము ప్రకటింపబడుచుండెడి పత్రికలకీమె నీతి దాయకములు, నాహ్లాదకరములునగు ననేకాంశములను వ్రాయుచుండెడిది.

ఈమెకుగల స్వజాత్యభిమానము చెప్పశక్యము కానిది. ఈమె తన జాతిపైనిష్కారణముగా ద్వేష్టలగువారు మోపెడినిందలను గూకటివేళ్ళతో బెల్లగించి, స్త్రీ జాతికిగల సహజ సద్గుణవితానమును సోదాహరణముగా బ్రతిపాదింప గంకణము గట్టుకొనెను. ఈ ప్రతిజ్ఞ 'అబలాసచ్చరిత్ర రత్నమాలా' రచనారూపముగా నెరవేర్చుకొనెను. అబలాసచ్చరిత్ర రత్నమాల రచించు