ఈ పుట ఆమోదించబడ్డది
నేను ముస్లింను ఎందుకు కాదు?
Why I am not a Muslim by IBN WARRAQ,
(Pub :- Promethus Books, U.S.A.)

కథ చెప్పడమేగాదు,వినడం కూడా చేతకావాలన్నాడు రాచకొండ విశ్వనాధశాస్త్రి. పుస్తకాలు రాయడం ఒక ఎత్తు. వాటిని అచ్చు వేయడానికి ధైర్యం కావాలి. సాల్మన్ రష్డీ, తస్లీమానస్రీన్ (బంగ్లాదేశ్ "లజ్జ" రచయిత్రి) రచనలు వెలువడిన తరువాత, చాల మంది ప్రచురణకర్తలు వివాదాస్పద రచనలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లింలను, మహమ్మద్, కొరాన్, ఇస్లాం చట్టాలను విమర్శించే గ్రంథాల జోలికి పోకూడదనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో అమెరికాలోని హ్యూమనిస్టు ప్రచురణ సంస్థ ప్రామిథిస్ వారు ధైర్యంగా యీ పుస్తకాన్ని యిటీవలే వెలువరించడం ఆహ్వానించదగిన మార్పు.

పుస్తకరచయిత ముస్లిం. ఇస్లాంను బయటివారు విమర్శించిన రచనలు చాలా వున్నాయి. వాటిని ముస్లింలు అంతగా పట్టించుకోరు. కాని తమలోని ఒక వ్యక్తి విమర్శిస్తే. చంపేసే వరకూ, అమానుషంగా ప్రవర్తిస్తారు. శటానిక్ వర్సెస్ రాసిన సాల్మన్ రష్డీని చంపేయమని ఇస్లాం అధిపతి అయొతుల్లా ఖొమిని ఉత్తర్వులు జారీచేశారు. బంగ్లాదేష్ లో తస్లీమా నస్రీన్ కు తలదాచుకునే అవకాశం లేక, స్వీడన్ కు పారిపోవాల్సిన దుర్గతి పట్టించారు. వారి పుస్తకాలను నిషేధించారు. మళ్ళీ యీ దేశాలన్నీ మానవ హక్కుల పత్రం పాటిస్తామని సంతకాలు చేసిన వారే! ఇబన్ వారక్ రచన చాలా లోతుపాతులతో, నిశిత పరిశీలనతో, అనేక మంది రచయితలను పట్టి చూచి రాసిన గ్రంథం. అంతా అయిన తరువాత ఇక తాను ముస్లింగా వుండలేనంటున్నాడు. అది ధైర్యానికి నిదర్శన ప్రకటన.

బెర్డ్రాండ్ రస్సెల్ నేనెందుకు క్రైస్తవుణ్ణి కాదు అనే రచన చేస్తే ప్రపంచంలో ఇతర మతస్తులు మెచ్చుకున్నారు. ఇబన్ వారక్ అంటాడు. రసెల్ రచనలో క్రీస్తుకు బదులు అల్లాను పెడితే, అదంతా ముస్లింలకు యధాతధంగా వర్తిస్తుంది. అలాగే అన్ని మతాలకూ చెందుతుంది. నేనెందుకు హిందువును కాలేదు అని యిటీవల రామేంద్ర బీహార్ నుండి ఒక రచన ప్రచురించాడు. అదికూడా రసెల్, ఇబన్ వారక్ ధోరణిలోదే.

ఈ రచనలో 17 అధ్యాయాలు వున్నవి. ఇబన్ వారక్ చాలా పరిశోధన చేసి ప్రతి అంశాన్ని పట్టిచూచి, రాశాడు. రష్డీ వ్యవహారంతో తొలి అధ్యాయం ఆరంభమౌతుంది. 1989 ఫిబ్రవరిలో ఇరాన్ అధిపతి అయొతుల్లా ఖొమిని ఫత్వా జారీచేసి సాల్మన్ రష్డీని చంపమన్నాడు. పాశ్చాత్యులలో కొందరు ముస్లింలను దువ్వడానికిగాను యీ చర్యను సమర్ధించారని, ఖొమిని చర్యను ఖండించలేకపోయారని ఆయన చూపారు. ఫ్రెంచి తత్వవేత్త పూకోసైతం ఖొమిని చర్యల్ని ఆహ్వానించి, ఇరాన్ లో దారుణాల పట్ల కళ్లు మూసుకున్నట్లు రచయిత ప్రస్తావించారు. శాస్త్రీయ