ఈ పుట ఆమోదించబడ్డది

లోగడ ధీరేంద్ర బ్రహ్మచారి డిల్లీలో టి.వి.లో యోగప్రచారం చేశాడు. ఆయనకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధి అండ వుండేది. ఆయనకు ఆయుధాల కర్మాగారం వున్నదని తరువాత బయటపడి పరువు పోయి ప్రచారం కోల్పోయాడనుకోండి. అలాగే కొందరు నేడు పదవులలో ఉన్నవారి ప్రాపకం సంపాదించి, యోగాన్ని ప్రచారం చేస్తున్నారు. యోగానికి రాజకీయం జోడైంది. కీలక పదవులలో వున్నవారు యోగాన్ని సమర్ధించడం తెలిసి కాదు. ఇతరేతర కారణాలే అందుకు కారణం.

ఆరోగ్యానికి ఎక్సర్ సైజ్ చేయడం యోగ కాదు. ఏదైనా రుగ్మతులున్నవారు డాక్టర్ ను సంప్రదించి, వ్యాయామం చేయడం మంచిది. యోగ వలన వచ్చే పరిణామాలకు బాధ్యులు లేరు. ఇన్సూరెన్స్ లేదు. యోగ శాస్త్రీయ పరిశోధనకు గురి చేసిన దాఖలాలు లేవు. అలా చేయకుండా అనుమతించడం ప్రభుత్వానికి సైంటిఫిక్ పాలసీ లేకపోవడమే!

- నాస్తికయుగం,మే 2001
యోగ

చదువుకున్న వారిని సులభంగా మోసం చేయవచ్చు అనడానికి ఇప్పుడు విరివిగా వ్యాపిస్తున్న యోగ దుకాణాలే దానికి నిదర్శనం వీధి వీధికి కొత్త పేర్లతో వెలిసిన యోగ కేంద్రాలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి.

రోగాలు వచ్చిన వారు, ఇళ్ళలో సమస్యలున్నవారు టెన్షన్ పడుతున్నవారు, యీ యోగ విధానాలకు ఆకర్షితులవుతున్నారు. యోగం భారతీయ విలక్షణ విధానం. ఇది యిప్పుడు విదేశాలలో కూడా గిట్టుబాటు వ్యాపారంగా ప్రచారమవుతున్నది.

యోగ స్కూలు తెరవడానికి, ఫీజులు వసూలు చేయడానికి, లైసెన్స్ అవసరం లేదు. పెట్టుబడులు సైతం అట్టే అక్కరలేదు. యోగాభ్యాసాలతో బాటు ఆకర్షణీయంగా మాట్లాడడం. కొంత ఆధునిక పరికరాలు జోడించడం కూడా ఆకర్షణకు తోడ్పడుతున్నది. యోగం పేరిట చికిత్సకు ముడిపెడుతున్నందున దీనికి కొత్త కారణం వచ్చింది కూడా.

యోగం వలన రిలాక్స్ కావచ్చుననీ, టెన్షన్ తగ్గించుకోవచ్చునని, ప్రశాంతత వనగూడునని తాత్కాలికంగా కష్టాలు మరిచిపోవచ్చుననీ, ఆరోగ్యం కుదుట బడుతుందనీ చెబుతారు. ఇవన్నీ ఆకర్షణీయాలే కాగా చాలామంది ప్రశ్నించకుండా యోగాభ్యాసాలకు లొంగిపోతున్నారు. ఇటీవలే కొత్త మాటలు వినవస్తున్నాయి. యోగ కూడా సైంటిఫిక్ అనడం!

యోగానికి మూలసూత్రం చిత్తవృత్తి నిరోధం. అంటే మానవుడి ప్రధాన లక్షణమైన ఆలోచనను స్తంభింపజేయడం. యోగంలో ఇంద్రియాల్లో ఒక వస్తువుపై గాని బిందువుపై గాని