ఈ పుట ఆమోదించబడ్డది

1954లో చనిపోయిన అనంతరం, అడ్వొకేట్ గా ప్రాక్టీసు చేసిన శాస్త్రిగారు రాజగోపాలాచారి వాదనల పట్ల, ఉదారవాద, స్వేచ్ఛాభావాల పట్ల ఆకర్షితులయ్యారు.

1959లో రాజాజీ స్వతంత్ర పార్టీ స్థాపకులుగా ఆంధ్ర పర్యటించినప్పుడు కాకినాడలో శాస్త్రిగారింట్లో జరిగిన విందులో నేను పాల్గొన్నాను. ఆనాడు గొప్ప సభ జరిగింది. రాజాజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించిన ఉషశ్రీ విఫలమయ్యారు. చివరకు శాస్త్రిగారి సలహాపై గౌతులచ్చన్న అనువదించి, మెప్పించారు. శాస్త్రి స్వరాజ్య పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. కె.సంతానం సంపాదకుడుగా మద్రాసు నుండి నడిచిన ఆ పత్రిక మేధావులను ఆకర్షించింది. ముఖ్యంగా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని అడ్డుకున్నది.

ఎం.వి.శాస్త్రి ఆంధ్రలోని రాడికల్ హ్యూమనిస్టులలొ ఆవుల గోపాలకృష్ణ మూర్తికి సన్నిహితులుగా వుండేవారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎం.వి.శాస్త్రి నిలిచారు. ములుకుట్ల వెంకటశాస్త్రికి ఓటు వేయమంటూ ఆయన ఒక ఆకర్షణీయ విజ్ఞప్తి ఓటర్లకు పంపారు. శాస్త్రిగారు నెగ్గి, ఎం.ఎల్.సి.గా ఒక టరం పనిచేశారు.

శాసనమండలిలో పరిమితంగా మాట్లాడినా,చాలా లోతైన భావోపన్యాసాలు చేశారు. హుందాగా ప్రవర్తించారు. 1962 నుండి ఆయన ఎంఎల్.సి.గా హైదరాబాద్ లో వుంటూ వచ్చారు. అప్పుడే స్వతంత్ర పార్టీ సమావేశాల్లోనూ పాల్గొన్నారు.

రాజగోపాలాచారి ముఖ్యంగా ఎం.వి.శాస్త్రి తీర్మాన పాఠాన్ని మెచ్చుకునేవారు. శాస్త్రిగారు రాస్తే రాజాజీ యథాతథంగా అక్షరం మార్చకుండా ఆమోదించేవారు. ఆయన ఇంగ్లీషు అంత బాగా వుండేది. శాస్త్రి గారికి అందరూ అమ్మాయిల సంతానమే. పెళ్ళిళ్ళరీత్యా వారిలో కొందరు అమెరికా వెళ్ళారు. శాస్త్రి గారు అనేక పర్యాయాలు అమెరికా పర్యటించారు. హైదరాబాదులో వుండగా దంటు భాస్కరరావుతో కలిసి శాస్తిగారు వినోద, సాహిత్య కార్యకలాపాలు ఆనందించేవారు. శాస్త్రిగారి వ్యాసాలు,శాసనమండలి ఉపన్యాసాలు గ్రంథస్తం కావలసివుంది. 1990లో శాస్త్రిగారు మరణించారు.

- వార్త, 7 అక్టోబరు,2001
విశిష్ట పాత్రికేయుడు ఎజికె

దినపత్రికల నాయకత్వం అనే శీర్షికతో ఆనాటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలను హద్దుల్లో పెట్టిన అసాధారణ వ్యక్తి ఆవుల గోపాలకృష్ణమూర్తి. తెనాలిలో 1942లో రాడికల్ అనే పత్రికా సంపాదకుడుగా ప్రారంభించి, ఉత్తరోత్తరా రాడికల్ హ్యూమనిస్ట్, సమీక్ష అనే పత్రికలు నడిపారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఎ.జి.కె.అసాధారణ పతిభావంతుడుగా గుర్తింపు పొందారు.