ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నేళ్ళకు ముందు మానవుడు లేనట్లే, కొన్నేళ్ళ తరువాత మానవుడు లేకుండా పోవచ్చు. అయితే సైన్స్ కాలమానం ప్రకారం అది కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. తక్షణ ప్రమాదం మానవ ఉనికికి లేదు. ఈ దృష్ట్యా, మానవుడు ఇసుకలో బొమ్మవలే చెరిగిపోతాడనడం అంత ఉచితం కాదేమో!

సమకాలీన విమర్శలకై పరిశీలించాల్సిన రచనలు:

1. Michel Foucault : The Order of Things

2. Jean Francois Lyotard : The Post Modern Condition

3. Richard Rorty : The Consequences of Pragmatism

4. David Ehranfeld : The Arrogance of Humanism

5. James Rachels : Created from Animals

6. Martin W. Lewis : Green Delusions

7. Bill McGibben : The End of Nature

8. Edward O. Wilson : The Biophilia Hypothesis 1993

9. Jacques Derrida : The End of Man in Margins of Philosophy 1982

10. E. Ann Kaplan (ed) Post Modernism and its Discontents

11. Hugh silverman (ed), Donn Welton : Post Modernism and Continental Philosophy

12. Robert Basil (ed) On the Barricades, 1989, Prometheus book, USA.

13. Corliss Lamont : The illusion of Immortality

1990 Half Moon Foundation New York PP 303.

- మిసిమి మాసపత్రిక, జూన్-1995
వేదాల్లో క్లోనింగ్ ఉందట

వైద్యరంగంలో విప్లవాలు వస్తున్నాయి. అంటురోగం వస్తే తుడిచిపెట్టుకుపోయే కాలం పోయింది. కొత్త రోగాలు వస్తుంటే సరికొత్త చికిత్సలు, మంచి మందులు కనుగొంటున్నారు. ఇది నిత్య పరిశోధనా ఫలితం, శుచి, శుభ్రం అనేది దేహారోగ్యానికి ముఖ్యం అని తెలుసుకోవడం వైద్యరంగంలో తొలిమెట్టు. ఇప్పుడు శస్త్రచికిత్సలు చేయాలంటే మత్తుమందువల్ల(అనస్తీషియా) అతి సులువుగావడం పెద్ద విశేషం. చాలా కాలం సూక్ష్మజీవులు వైరస్ వల్ల రోగాలు వస్తాయని తెలుసుకోలేకపోయారు. అది తెలిసిన ఫలితంగా మందులు, టీకాలు వచ్చేశాయి. ఈ విధంగా ఎప్పటికప్పుడు పరిశోధనలు ఫలితంగా వైద్య విప్లవాలు వచ్చి, ఆయుష్షు పెంచుతున్నాయి.