ఈ పుట ఆమోదించబడ్డది

అయితే హైందవ ఔన్నత్యం అనే అతి జాతీయవాదాన్ని బోధించిన వివేకానంద, ఫాసిజానికి పునాదులు వేశాడు. పాశ్చాత్య దేశాలకన్న ఇండియా గొప్పది అనే శుష్కనినాదం తాత్కాలికంగా కొందరిని ఉత్తేజపరచినా ఆచరణలో ప్రయోజనం లేదని తేలింది. హేతువాదాన్ని చంపడానికి ప్రయత్నించిన వివేకానంద దేశంలోని మూఢవిశ్వాసాలకు పునాదులు గట్టిపరచాడు. ఆధునీకరణ గావించడాన్ని పాశ్చాత్యంగా భోదించాడు!

వివేకానందలో రెండు వ్యక్తిత్వాలున్నవి ఒకటి దేశభక్తి, బాధితుల పట్ల ఆదరణ. దీనితోనే ఆయన చాలా మందిని ఉత్తేజపరచగలిగాడు. రెండవది వేదాంతసారమైన మాయావాదం సంపన్నులంతా యీ మాయావాదం వివేకానంద పట్ల ఆకర్షితులయ్యారే గాని, ఆయన సేవాతత్పరతను చూచికాదు. తప్పనిసరి పరిస్తితులలో బ్రహ్మచారిగా వుండిపొవలసిన వివేకానందను సన్యాసిని చేసి రామకృష్ణ మరీ యిబ్బంది పెట్టేశాడు. ప్రకృతి ఆయనపై కసి తీర్చుకోగా 39 సంవత్సరాలకే 1902లో వివేకానంద చనిపోయాడు.

రామకృష్ణ తెలిసీ తెలియక జమిందార్లకు ఉపయోగపడితే, వివేకానంద కావాలని జమిందార్లను వెనకేసికొని, వారికి అండగా నిలిచాడు. పేదల పొట్ట గొడుతున్న జమిందార్లను ప్రజల ఆగ్రహానికి గురికాకుండా వేదాంత చక్రాన్ని అడ్డేశాడు. దోపిడీ విధానానికి అణచివేతకు అండగా నిలిచాడు. పేదలపట్ల ఎంత జాలి చూపినా, జమిందార్లకే ఫలితం దక్కింది!

(నిరంజనధర్ 'వేదాంత-బెంగాల్ రినైజాన్స్'కు కృతజ్ఞతతో)

- హేతువాది, మార్చి 1985
21వ శతాబ్ది తాత్వికుడు పీటర్ సింగర్

గౌరి తీరిగ్గా టి.వి. చూస్తున్నది. అనాధ పిల్లల్ని అప్పగిస్తే లక్ష రూపాయలు ఒక్కొక్కరికీ యిస్తామని, అమెరికాలో పిల్లలు లేని సంపన్నులు పెంచుకోడానికి ముందుకు వస్తున్నారని ప్రకటన చూచింది. వెంటనే తనకు తెలిసిన వీధి అనాధ బాలుడిని టి.వి.లో చూపిన అడ్రస్ కు చేరవేసింది. లక్ష రూపాయలు కళ్ళజూసింది. హాయిగా కొత్త మోడల్ టి.వి.సెట్ కొనుక్కున్నది. విలాసవంతమైన హోటల్ కు వెళ్ళి ఖరీదైన భోజనం చేసి తృప్తిగా తేపింది. ఇంతలో పక్కింటి లక్ష్మి వచ్చి గౌరికి ఒక వార్త చేరవేసింది. టి.వి.లో ప్రకటించునట్లు, కొనుక్కున్న పిల్లల్ని అమెరికా సంపన్నులకు చేర్చడం లేదట. పిల్లల్ని చంపేసి వారి కిడ్నీలు, లివర్, కళ్ళు విడి భాగాలుగా అమ్ముతున్నరట. గౌరి యీ దుర్వార్తకు అదిరి పడింది. ఇప్పుడేం చేయాలి. తన వద్ద వున్న డబ్బు తిరిగి యిచ్చేసి పిల్లవాడిని వాపస్ కోరాలా? వీధిలో దిక్కులేకుండా తిరుగుతున్న అబ్బాయి ఏమైతేనేం అని వూరుకోవాలా?

ఇది నైతిక సమస్య. ఇలాంటివి ఎదురైతే ఏం చేయాలి? ఆధునిక తాత్వికుడు పీటర్