ఈ పుట ఆమోదించబడ్డది

జె.బి.రైన్ పరిశోధనలు తన సిద్ధాంతాలకు మద్దతుగా చూపాడు.తీరా, జె.బి.రైన్ పరిశోధనలే శాస్త్రీయ పరిధికి నిలవకుండా పోయాయి. బయట ప్రపంచంలో జరిగే సంఘటనలే వ్యక్తికి అనుభూతులుగా ప్రతిబింబిస్తాయని యూంగ్ తన Synchronicity సిద్ధాంతంలో నమ్మాడు. అదే సిద్ధాంతం ప్రకారం,సమిష్టి అవ్యక్తత (Collective Unconscious)లోని అంశాలు వ్యక్తిలో ప్రతిబింబిస్తాయన్నాడు యూంగ్. యూంగ్ ఆర్కిటైప్ వాదం జ్యోతిష్యం చెప్పే రాసులవంటివి,వాటికి ఉనికిలేదు. అవి కేవలం నమ్మకంపై ఆధారపడినవే. పురాణగాధల్లోని అంశాలకు బాహ్యరూపాన్ని,వాస్తవికతను కల్పించే ప్రయత్నం కూడా యూంగ్ చేశాడు. ఆర్కిటైప్ అంశాలు వంశపారంపర్యతగా సంక్రమిస్తాయని కూడా యూంగ్ నమ్మాడు. క్వాంటం సిద్ధాంతంలో విషయాల్ని యూంగ్ తన సామ్యాలకి వాడుకోబోయి పొరబడ్డాడు. క్వాంటం సిద్ధాంత ప్రతిపాదనలు రుజువుకు నిలిచాయి. యూంగ్ చెప్పేవాటికి రుజువు గాక, నమ్మకమే ప్రధానం. అయినా యూంగ్, ఆర్థర్ కోస్లర్ వంటి వారి ఆసక్తి కారణంగా అతీంద్రియ శక్తుల పట్ల నమ్మకం పెరిగింది. వ్యక్తిగతంగా వుండే అవ్యక్తత, సమిష్టి అవ్యక్తత అనేవి మానవ సంపదగా చూపిన యూంగ్,క్రమానుగతంగా,లామార్క్ జీవ సిద్ధాంతం వలె, సంక్రమిస్తాయని అతడి నమ్మకం. వీటికి ఆర్కిటైప్ అని నామకరణం చేశాడు. భావాలకు యివే మూలం అన్నాడు.

టెలిపతి పట్ల ఉదార దృష్టి అవలంబించమని యూంగ్ కోరాడు. అతీంద్రియ శక్తులను సమర్ధించడానికి యూంగ్,ఒక సైంటిస్ట్ పాలి(Pauli)తో కలిసి Interpretation of Nature and Psyche అనే పుస్తకం రాశాడు. పదార్థానికి చెందిన సూక్ష్మరూపంలో సైకి విధానాన్ని నిర్మించవచ్చని అన్నాడు. సైన్సులో రుజువుకు నిలపకుంటే తోసిపుచ్చుతారు. యూంగ్ ఒక వైపున సైన్స్ ఉదాహరణలు తెచ్చి,తాను చప్పే సైకిని రుజువుకు పెట్టడానికి,రుజువు కాకుంటే నిరాకరించడానికి సిద్ధపడలేదు. అదే నమ్మకస్తుల బలం! అతీంద్రియ శక్తుల విషయంలో అత్యంత ఉత్సాహం చూపిన ఆర్థర్ కోస్లర్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

నేడు పేరా సైకాలజీ కొన్ని యూనివర్శిటీలలో కోర్సులుగా వున్నది. అక్కడ మాత్రం దీనికి ఎలాగైనా శాస్త్రీయగౌరవాన్ని తీసుకరావాలని కృషి చేస్తున్నారు. ఆధినిక విజ్ఞాన సాంకేతిక పరికరాల సహాయంతో వివిధ పరిశీలనలు జరుపుతున్నారు. ఇంత వరకూ నిర్ధారణగా ఒక్క పేరా సైకాలజీ పరిశోధనకూ శాస్త్రీయ ప్రమాణం రాలేదు. పేరా సైకాలజీని సైన్సులో భాగంగా పరిగణించడానికి అవకాశం లభించడం లేదు,ఇదీ వాస్తవ పరిస్థితి. సైన్స్ పేరిట,శాస్త్రీయ పరిశోధనల పేరిట మోసాలు చేసి తాత్కాలికంగా నమ్మించడం పేరా సైకాలజీలో పరిపాటి అయింది. శాస్త్రీయ పరిశోధనలంటూ కొన్ని పత్రికలలో వివరాలు ప్రచురించడం,తీరా వాటిని మళ్ళీ పరీక్షకు పెడితే ఫలితాలు రాకపోవడం సర్వసాధారణమై పోయింది.

ఇంత జరుగుతున్నా,సైన్స్ నేటికీ దృక్పథంతో, సహనంతో వుంది. పేరా సైకాలజీ ఎప్పుడు అక్కడ రుజువుపరచినా ఆమోదించడానికి సైన్స్ సిద్ధపడుతోంది.ఏమైనా సరే,పేరా