ఈ పుట ఆమోదించబడ్డది

వివేకానంద యోగి ప్రచారాన్ని అగేహానంద భారతి విమర్శించారు. ఆత్మ పరమాత్మల సంలీనాన్ని సూచించే లయ యోగానికి వివేకానంద రాజయోగం అనే ఆకర్షణీయ పదం వాడాడన్నారు. గురువు లేకుండా యోగం అభ్యసిస్తే ప్రమాదకరమని హెచ్చరించిన వివేకానంద, అలాంటి ప్రమాదాన్నే చిట్కా కరపత్రాలలో ప్రచారం చేశాడన్నారు. వైద్యం చేసేవారు నాలుగు రకాల డాక్టర్లన్నట్లు, యోగాన్ని 4 రకాలుగా వర్గీకరించి వివేకానంద ప్రచారం చేయడాన్ని భారతి పెద్ద దోషంగా పేర్కొన్నారు. రాజ, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల పేరిట వివేకానంద చేసిన ప్రచారం ఆధారంగా చాలామంది పాశ్చాత్యలోకం, అదే పరమసత్యం అనే భ్రమలో వున్నట్లు భారతి చూపారు. పతంజలి యోగాన్ని వక్రీకరించిన వివేకానందను, కొందరు స్వాములు బాగా వాడుకుంటున్నారన్నారు.

వివేకానంద పుస్తకం చదివి యోగాభ్యాసం చేసి పిచ్చెక్కిన వాళ్ళున్నారని భారతి చెప్పారు. హిందూమతం సహనంతో కూడిందనే వివేకానంద వాదం కూడా పూర్తిగా దోషపూరితమనీ, మూలసూత్రాలలో హిందూమతం యితర మతాలతో అంగీకరించదని, తీవ్రస్థాయిలో వాదిస్తుందనీ ఆయన చెప్పారు.

మత సమావేశాల అనంతరం అమెరికాలో వివిధ ప్రాంతాలు పర్యటించిన వివేకానంద విలాసవంతమైన స్టార్ హోటళ్ళలో వుంటూ డబ్బుకు కొదవలేని స్థితిలో, ప్రచారాన్ని చేసి, వివిధ పరిచయాలతో కొంతకాలం గడిపారు.

తిరిగి వస్తూ ఇంగ్లండ్ లో ఆగిన వివేకానంద ఎడ్వర్డ్ స్టర్డీకి అతిథిగా వున్నారు. కాని వివేకానంద విలాసజీవితం చూచిన తరువాత అతిత్వరలోనే ఎడ్వర్డ్ తన సంబంధాన్ని తెంచుకున్నాడు. అమెరికాలొ లియో లాండ్స్ బర్గ్ కూడా వివేకానందతో సంబంధాలు తెంచుకోడానికి విలాస జీవితమే కారణం.

అమెరికా నుండి ఇంగ్లండు వచ్చిన వివేకానంద మతపరమైన మార్గరెట్ నోబుల్ అనే యువతిని తన శిష్యురాలిగా లోకానికి పరిచయం చేశారు. ఆమె నివేదిత వివేకానంద చనిపోయిన తరువాత ఆమె స్కూలు పెట్టి, సొంతంగా సామాజిక సేవ చెసింది వివేకానంద ప్రభావం ఆమెపై తాత్కాలికమే అయింది.

ఇండియాకు విజయవంతంగా తిరిగి వచ్చిన వివేకానందకు జమిందార్లు అపూర్వ స్వాగతం పలికారు. వారి డబ్బుతో అమెరికా వెళ్ళిన విషయం వివేకానంద విస్మరించలేదు. దేశంలో అడుగుపెట్టగానే రామనాథపురం రాజా ఘనస్వాగతం ఏర్పాటుచేసి, తొలుత అడుగిడిన చోట వివేకానంద విగ్రహస్థాపన చేయించాడు. ఆచరణాత్మక వేదాంతాన్ని చూపడానికి వీలుగా పేదలకు రాజావారు అన్నదానం చేసి, ప్రాక్టికల్ వేదాంతానికి ప్రారంభోత్సవం చేశారు.

వివేకానంద అశ్వంథాన్ని స్వయంగా రాజా కూడా కాసేపు లాగి తన వేదాంత భక్తిని