ఈ పుట ఆమోదించబడ్డది

బట్టబయలుచేశారు. నాస్తికత వివరించి ప్రతి రాడికల్ హ్యూమనిస్ట్ కూడా నాస్తికుడేననీ, అయితే తాత్విక అవగహన, తాత్వికపునాదులు మానవవాదులకు వుండటంతో వారి ధోరణి పరోక్షంగా గాక,ప్రత్యక్షంగా సాగిపోతుందన్నారు.

రాణె రచనలు ఇంగ్లీషులో సరళంగా వున్నాయి.

M.A. Rane, 75th Birthday Felicitation Committee వారు ప్రచురించిన 500 పుటల గ్రంథాన్ని 300 రూపాయలకు యిస్తున్నారు.

- హేతువాది, ఏప్రిల్ 2001
అబద్దాల వేట
ఏది సత్యం? గాంధీగారూ!

గాంధీగారిని కాంగ్రెసు వారు, స్వాతంత్ర పోరాటయోధులు, సర్వోదయవాదులు "మహాత్మ"గా చూస్తారు.

మానవవాదులు, హేతువాదులు గాంధీజీని మనిషిగా భావించి, అంచనావేస్తారు. అందరి మనుషులవలె, గాంధీకూడా రాగ ద్వేషాలు, ఈర్ష్య అసూయలుగల వ్యక్తి. గాంధీజీ గొప్పతనాన్ని హేతువాదులు గ్రహిస్తారు, లోపాల్ని నిర్మొహమాటంగా చూపుతారు. అది శాస్త్రీయ ధోరణి. మనిషిని అంచనా వేయడానికి పూర్తి వ్యక్తిత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అన్ని వివరాలు కూలంకషగా తెలుసుకోవడం అవసరం, "మహాత్ముడ"ని ఆరాధించే వారు నిజానిజాలు విడమరచి చూడలేరు. సమాధుల్ని పూజిస్తారు, భజనలు చేస్తూ వ్యక్తి ఆరాధనతో తృప్తిపడతారు.

గాంధీజీ హేతువాదుల దృష్టిలో గొప్ప స్వాతంత్రపోరాట రధసారధి. సత్యాగ్రహాన్ని ఆయుధంగా స్వీకరించి, అహింసా పద్ధతిలో, అశేష ప్రజానీకాన్ని పోరాట రంగంలోకి దింపిన వ్యక్తి గాంధీజీ, దేశ స్వాతంత్ర విషయంలో రాజీపడకుండా పోరాడిన విశిష్ట నాయకుడు. చరిత్రలో గాంధీజీ ఆ విధంగా చిరస్మరణీయుడుగా నిలుస్తాడు. స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లింలను కలుపుకురావాలని ఆకాంక్షించిన గాంధీజీ, మత సామరస్యతకై కృషిచేశారు. స్వాతంత్ర పోరాటాన్ని గ్రామాలలోకి తీసుకెళ్ళారు. మహిళల్ని ఉత్తేజ పరచారు. ఎటు చూచినా దేశ స్వాతంత్ర పోరాట నాయకుడుగానే గాంధీజీ కనబడతారు. మంచి లక్ష్యానికి మంచి మార్గం అనుసరించాలని చెప్పిన వ్యక్తిగా గాంధీజీ ఆదర్శప్రాయుడే. అలాంటి గాంధీజీ తన జివితమే సత్య పరిశోధనగా పేర్కొన్నారు. అందుకే జీవిత చరిత్ర రాశామన్నారు.

గాంధీజీ జీవితచరిత్ర పరిశోధించి రాయాల్సివుంది. ఇంకా ఆ పని జరగలేదు. ముఖ్యంగా గాంధీజీ తొలిజీవితం, దక్షిణాఫ్రికా రంగంలో ఆయన పాత్ర శాస్త్రీయ ఆధారాలలో