ఈ పుట ఆమోదించబడ్డది

జరిగినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభినందించాడు. పైకి ఎన్ని చెప్పినా రామమోహన్ ఆచరణలో కులాన్ని వదలుకోలేదు. బహు భార్యాత్వం కూడా పాటించి ముగ్గురిని పెళ్ళి చేసుకున్నాడు!

రామమోహన్ స్థాపించిన బ్రహ్మసమాజ్, 1833లో ఆయన ఇంగ్లండ్ లో చనిపోయిన అనంతరం విచ్ఛిన్నదశలో పడింది. దేవేంద్రనాధ్ ఠాగోర్ పూనుకొని పునరుద్ధరించకపోతే బ్రహ్మసమాజ్ ఏమయ్యేదో?

రామమోహన్ ప్రారంభించిన బ్రహ్మసమాజ్ కు దేవేంద్రనాధ్ ఠాగోర్ నీరు పోశాడు. దేవేంద్రనాధ్ ఠాగోర్ యిచ్చిన ఆర్ధిక సౌకర్యాలు అందుకు ఉపకరించాయి. దేవేంద్రనాధ్ 1839లో తత్వబోధిని సభకూడా ప్రారంభించి, బ్రహ్మసమాజ్ కు సోదరసంస్థగా కొనసాగించారు. 1843లో తత్వబోధిని పత్రిక ప్రారంభించారు. ఆ ఏడే ఒక సమావేశం ఏర్పరచి సభ్యత్వం పెంచే చర్చలు సాగించారు. చేరిన సభ్యులకు క్రమశిక్షణ, నియమ నిబంధనలు ఏర్పరచారు. అప్పటినుండి ఆయనతో పాటుగా అక్షయకుమార్ దత్తు, రాజనారాయణ్ బోసు, కేశవచంద్రసేన్ ప్రముఖపాత్ర వహించారు.

బ్రహ్మసమాజ్ లో ప్రముఖ హేతువాది అక్షయకుమార్ దత్తు, తత్వబోధిని పత్రిక సంపదకుడుగా తన భాషాశైలితో ఎందరినో ఆకట్టుకున్నాడు. రామమోహన్ అనుసరించాలనే అక్షయకుమార్ ఆనాటి దేవేంద్రనాథ్ మత ఛాందసాన్ని వ్యతిరేకించాడు.

వేదాలు అపౌరుషేయాలా అనే చర్చ దేవేంద్రనాధ్, అక్షయకుమార్ ల మధ్య సాగింది. వేదాలలో దోషాలు, వైవిధ్యాలు ఉన్నాయి. అలాంటప్పుడు వేదాలను ప్రమాణంగా ఎలా స్వీకరించడం? ఈ విషయాన్ని 1850లో అక్షకుమార్ దత్తు బాహాటంగా ఒక సమావేశంలో ప్రకటించారు. ఆ వాదనను బ్రహ్మసమాజ్ లో సనాతనులు ఒప్పుకోలేకపోయారు. రాజనారాయణ్ ఇందుకు అంగీకరించలేదు. బ్రహ్మసమాజ్ చీలడానికి అది నాంది అయింది. దేవేంద్రనాధ్, రాజనారాయన్ లు క్రైస్తవ వ్యతిరేక ధోరణి వ్యక్తపరచగా, మరోవైపు మధ్యతరగతిలో యువకులు కొందరు క్రైస్తవ మతంలోకి మారిపోయారు. బ్రహ్మసమాజ్ లో దేవేంద్రనాధ్ ఆసక్తిని కొల్పోతున్న సమయంలో అక్షయకుమార్ దత్తు 1854లో ఆత్మీయసభ సమావేశం ఏర్పాటుచేశారు. దేవుడి లక్షణాలు ఎలాంటివో చర్చించి, చేతులెత్తే పద్ధతి ద్వారా, అధికసంఖ్యాకుల నిర్ణయం ప్రకారం వాటిని నిర్ధారించారు. ఆ తరువాత దేవేంద్రనాధ్ హిమాలయాలకు వెళ్ళిపోగా, అక్షయకుమార్ రిటైర్ అయ్యారు.

సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సందర్భంగా,1857లో కేశవచంద్రసేన్ బ్రహ్మసమాజ్ లో చేరి, మళ్ళీ జీవం పోశారు.

కేశవచంద్రసేన్ యించుమించు బ్రహ్మసమాజానికి ఉగ్రవాదిగా పనిచేశారు. సమాజం ఒక వైపున బహుళ ప్రచారం పొందినా, అతిత్వరలోనే చీలికకు కూడా దారితీసింది. కేశవచంద్ర ప్రేరణతో మహారాష్ట్రలో ప్రార్థనా సమాజం ఆరంభించారు. క్రైస్తవమతం పట్ల విపరీతంగా