ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతిష్ఠించమనీ, ఉత్సవాలు జరపమనీ కోరుతున్నారు. ఇలాంటి అంబేద్కర్ వాదులను సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధమే. అది కూడా అంబేద్కర్ వాదాన్ని ఉరితీయడానికి పన్నుగడే. ఈ విషయం గ్రహించడానికి అంబేద్కర్ వాదులకు కొంతకాలం పట్టొచ్చు. ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది.

ముందుగా కాంగ్రెసుపార్టీ అంబేద్కర్ వాదం పరిశీలిద్ధాం:

కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ ప్రేమ

"కాంగ్రెస్, గాంధీజీ అంటరాని వారికేం చేశా"రని ప్రశ్నిస్తూ అంబేద్కర్ పుస్తకం రాసి, గాంధీ బ్రతికుండగానే ప్రచురించారు. ఆ ప్రశ్నలకు నాటికీ, నేటికీ సమాధానం రాలేదు. బహుశా రాదుకూడా. గాంధీజీ సమాధానం చెప్పకపోవడానికి వ్యూహం,ఎత్తుగడ కారణాలైతే,కాంగ్రెసువారు జవాబివ్వకపోడానికి అశక్తత కారణం. అప్పటి కాంగ్రెసు వేరు, నేటి కాంగ్రెసు వేరు అనడానికి వీలున్నదా అంటే,వీల్లేదేమో. 100 సంవత్సరాల కాంగ్రెసు ఉత్సవాలు జరుపుకున్న కాంగ్రెసువారు, కాంగ్రెసు సంస్కృతి పుణికి పుచ్చుకున్నట్లు సహర్వంగా చెప్పుకున్నారు. కనుక, అదంతా చరిత్ర. నేడు కొత్తగా ఆరంభిద్ధాం అనడానికి వీల్లేదు. అలాగే కాంగ్రెసుకు గుత్తాధిపత్యంగా గాంధీజీని స్వీకరించిన పార్టీ అంబేద్కర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. అంబేద్కర్ వ్రాసిన పుస్తకం సారాంశంగా ప్రశ్నలేమిటో చాలా సంక్షిప్తంగా ఒక్కసారి కాంగ్రెసువారికి జ్ఞాపకం చేద్దాం. ఆ తరువాత వారేమంటారో వారికే వదిలేద్దాం.

సమాజంలో సంస్కరణలు కావాలని కాంగ్రెసు పుట్టినప్పటినుండీ ఒకవర్గం అభిప్రాయపడినా, రాజకీయ స్వాతంత్ర్యానికే ముందు ప్రాధాన్యత యివ్వాలని బలమైన వర్గం వాదిస్తూ వచ్చింది. కాంగ్రెసులో సంప్రదాయవాదులుగా ప్రభావితం చేసిన బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్ హిందూ సమాజాన్ని వెనకేసుకొచ్చారు. పైకి అన్ని చెప్పినా,కుల హెచ్చుతగ్గులు, అంటరానితనం పోవాలని వారు చిత్తశుద్ధితో కృషిచేయలేదు. అంటరానితనాన్ని డొంకతిరుగుడు వాదంతో అనిబిసెంట్ సమర్చించింది. కాని, అంటరానితనం తొలగించాలంటూ ఆమె అధ్యక్షతన మోసగించడం ఒక పథకం ప్రకారం సాగిపోయిందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.

ఆ తరువాత గాంధీజీ రంగప్రవేశం చేసి,కాంగ్రెసును ఆక్రమించి, అంటరానివారి ఉద్ధారకుడుగా ఎప్పటికప్పుడు భ్రమలు కల్పించడం, ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. అంటరానితనం తొలగించడానికి కార్యక్రమం చేబట్టాలని 1922లో గాంధీజీ ఆధ్వర్యాన కాంగ్రెసు పార్టీ తీర్మానించింది. దీనినే బార్డోలో తోర్మానం అంటారు. అంతే, తీర్మానంతోనే పని ఆగిపోయింది. గాంధీజీ మాత్రం అంటరానివారి ఆర్తత్రాణపరాయణుడుగా పేరు తెచ్చుకున్నాడు. కాంగ్రెసువారు కమిటీలు వేశారే తప్ప,ఏమీ చేయలేదు. గాంధీజీ మిగిలిన విషయాలలో వెంటాడి పనులు