ఈ పుట ఆమోదించబడ్డది
iv
చంద్రికాముద్రాశాల, గుంటూరు
శ్రీముఖ సం|| భాద్రపద బ౨ (6-9-1988)

... మీ రారోగ్యభాస్కరములోని పద్యముల నుల్లేభించుచువ్రాసిన ... కార్డుచేరి సంగతులు విశదమైనవి. ఇంతకాలము మీరట్లు జాడ్యగ్రస్తులగుట ప్రవాసముండుట విత్తవసతిలేక చిక్కుపడుట పత్రిక నిలిచిపోవుట ౠణబాధ కలుగుట మున్నగు మీ ప్రకృతస్థితి పర్యాలోచింపఁగా 'నీచైగ్గచ్ఛ త్యుపరిచదశా చక్రనేమిక్రమేణ' యను కాళిదాసోక్తిజ్ఞప్తిఁదగులుచున్నది. గ్రహానుకూల్య మెప్పుడేర్పడునో యప్పుడ సమస్తము సప్రయత్నముగఁ జక్కఁబడఁగలదుగాన మీబోటి విజ్ఞులు 'భవితవ్యం భవత్యేవ' యను నిశ్చయమున నిట్టియిక్కట్టుల సహించి తదర్ధమై నిరీక్షింతురేకాని యెప్పట్టునను నైరాశ్యము నొందరు. పత్రికాపున:ప్రకటన సందర్భమున మీరు సంపూర్ణారోగ్యము చూచుకొననిది యారంభించిన మి కింతను నాయాసముకలుగు నేమోనని నాభయము. పత్రికలఁ బడసియుఁ దమంతఁదాము చందాపంపునలవాటు లేని చందాదారులవలనఁ బ్రతిఫలమువడయుటలో నింకను బ్రయాసముగలుగునేమోయని భయమగుచున్నది. ఎట్లయినను మీయుత్సాహము పట్టుదల ప్రశంసనీయములు. బ్ర శంకరముగారును మీయుత్తరము చూచి యనుతపించిరి. వారును నార్ధికముగ మిక్కిలి చిక్కులలోనున్నారు... లోఁగడబాకీ తీర్మానముకాకయే మరల ముద్రించి యిచ్చు టెట్లాయని వెనుకాడుచున్నారు. అయినను మీరు క్రిత్తసంచిక ముద్రించి యిచ్చినతోడనే పైక మందఁజేయుదురేని మ్యాటరుపంపునట్లు వ్రాయుఁడనిరి, కానమ్యాటరు సిద్ధముగ నున్నచోఁ బంపుఁడు...

అమరేశ్వరుఁడు.
కొల్లాపురము
శ్రీముఖసం|| భాద్రపద బ౧౧ (15-9-88)

...మీలేఖ చేరినది. అందలి విషయంబులన్నియు విషాదసరంబులౌటచే నామనం బెంతయుఁ బరితపించినది. నాయర్ధాంగలక్ష్మియును దు:కించినది... ప్రసాదరావు గారు సర్వవిధముల మిమ్ముఁగనిపెట్టుట ప్రశంసాపాత్రము... ప్రసాదరాయునివంటి యుత్తముఁడు... దొరకఁడని నానమ్మిక. అందుచెతనే రావుగారికి

తె|| కపట మెఱుఁగని నీవంటి ఘనసఖుండు
ఒక్కఁ డున్నను జాలఁడొక్కోజగాన?
కష్టకాలములందు నక్కఱకురాని
బంధుజన మెంతయున్న నిష్ఫలముగాదె.

అని యొకలేఖగూడ వేఅసితి... వ్రాయఁబూనిన గ్రంథమగును.. ఒక్కమాటలో నాయాశయము వెల్లడించి ముగించెదను. లోకములో మిత్రప్రశంసఁ బ్రసాదరావుగారి పేరు సర్వజనులును వాడుకొందురుగాక. వారి యశస్సౌరభ మాంధ్రదే శోద్యానవనవాటికల వ్యాపించుఁగాక. వారికిఁ జిరాయురారోగ్యసంపత్తి ప్రసాదించి భగవానుఁడు సంరక్షించుఁగాత.

రామసుబ్బారాయుఁడు.
----------------