ఈ పుట ఆమోదించబడ్డది
31
మ|| అకటా! ఈగతి సర్వకాలముల సర్వావస్థలంగూడఁ దా

పకమౌ ధ్యానము చేయుచుండినను మత్పాదస్థమౌ వ్యాధి యిం

చికయుం దక్కువసేయ వేమనుదు? నశోకంబుఁ జల్లార్ప. వీ

వికృతవ్యాధి యిఁకెంతకాల మిటు న౯ వేఁచ౯వలె౯ భాస్కరా!

చం|| పవలును రేయి నీపయిని బద్యములల్లుచు నేను నాదు స

త్కవితను వ్యర్థపుచ్చుదునుగాక. సదా యిటు స్తూయమాను నీ

రవిత సహార్థమయ్యెడిని. రక్షణసేయక యుంటివేని నీ

వవుదువొ కావొ ధూతఋణుఁ డయ్యది యోజనసేయు భాస్కరా!

మ|| రవియుం గాంచని యబ్ధిపర్వతగుహారణ్యాదులంగూడఁ దా

కవి గాంచంగలఁ డ౯ జనశ్రుతి భవత్కర్ణప్రవిష్టంబుగా

కవిలంబంబుగ నాదు పాదరుజ నీ వంతంబునొంచింపవే౯

వివరింతుంద్వదదఃప్రవృత్తియచట౯ వెర్వేఱుగా భాస్కరా! ౨౧౨

మ|| కవితారూపముగా ననుక్షణమునుం గావించుచున్నాఅఁడ నే

భవదీయంబదు ధ్యాన. మైనయవియుం బద్యంబు లిన్నూటిపై.

దవులంద్రోయపు నాదుపాదరుజ. నీదాక్షిణ్యమేమందు? ఇ

య్యవియేయౌనొకొ ధ్యాయమానకరణీయప్రక్రియల్ భాస్కరా!

మ|| ఇది తత్కార్యము కాకవచ్చినది కానీ నేను బ్రార్థింపఁగ౯

హృదయంబందున ధ్యాయమానులగుచో నేదేవతల్ ధ్యాతృకా

మదుఘుల్గారు తలంప? కష్టములఁదా ర్మన్నించిపోకార్ప? రా

పదలం బాపెడివాఁడె దేవుఁడును సంప్రార్థ్యుండును౯ భాస్కరా!

చం|| అభయకరం బొసంగుమని తర్థనఁజేయుచునున్న నాపయి౯

రభసమున౯ సహస్రకరరాజి నిగుడ్చెదు. మాడ్చెదే? మహా

ప్రభువని యాచ్నచేసితిని భ్రాంతి. కటా! ఇటులౌటెఱుంగ. నీ

ప్రభ వెలిగింప కస్మదురుపద్రుజ మాంపు మిఁకేని భాస్కరా! ౨౧౫

ఉ|| ప్రార్థితుఁడైన సత్ప్రభువు ప్రాజ్ఞులఁ బహూకరించు. అ

భ్యర్థితుఁడౌ సదర్థి వెస నర్థుల కర్థము లొచ్చిపుచ్చు. సం

వర్థితుఁ డెందు దేహియనువానికి నాస్తియనండు. నీవె నా

ప్రార్థన వ్యర్థపుచ్చుటకుఁ బాల్పడినాఁడవు నేఁడు భాస్కరా! ౨౧౬