పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/96

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యామోహాన్ని ప్రకటించకపోవడం, ఆలోచనలు గాని, కార్యాచరణలుగాని తక్కువ సంఖ్యలో ఉండటం ఈ చౌక బేరానికి కారణాలు.

ఆండ్రూ కార్నెగీ స్కాచ్ వాడైనా కొత్త కొత్త సాహసచర్యల్లో పాల్గొనటానికి జంకే స్వభావం కలవాడు కాడు. ఆత్మశక్తిమీద అతనికున్న విశ్వాసం, విజయమార్గంలో క్రమమైన ఆరోహణము కనిపించటం అన్నవిరెండూ అతని అదృష్టంమీద అతనికి ఎరుకపడని ఏదో నమ్మ కాన్ని కలిగించాయి. ఇంకా ఎన్నో అవకాశాలను స్వీకరించటానికి అతడు సాహసించేటందుకు తోడ్పడ్డాయి.

అప్పుడా క్షేత్రాన్ని విక్రయించిన వ్యక్తి ఆలానా దేవిని గురించి బహుశ ఎంతో సంతృప్తి పొందివుంటాడు. అందులోని సాహసాన్నంతటినీ కొనేవాళ్లు భరించారు. తన తదనంతర జీవితాన్నంతటినీ సుఖంగా గడిపేటందుకు చాలినంత ధనాన్ని వారిచ్చారు. అయితే, మూడు నాలుగేళ్ళకు ఎంతో విలువైన బ్లాక్ పెన్సిల్వేనియా పెట్రోలియంను ఇచ్చి డజనో లేక అంతకంటే కొంచె మెక్కువో బావులు పడ్డ తరువాత ఆ ఆస్థి విలువను రమారమి అయిదు మిలియన్ల డాలర్లని ఆభూస్వామికి హృదయంలో తీవ్రమైన మంటలు చెల రేగి వుండవచ్చు.

కోల్ మన్ [యితనికి భూమిలో ఎక్కువభాగం తప్పదుగదా!] కార్నెగీ, వాండివోర్ట్, టామ్ మిల్లర్ ఇంకా యితరులు హోమ్‌వుడ్ బృందంలోవారు. ఆ క్షేత్రానికి