పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏమంటే - అతడు తనకు కొంత మెరుగు, వృద్ధి అవసరమని గుర్తించాడు. ఎంత ఆత్మవిశ్వాస మున్నప్పటికీ అతనిలోని సత్యసంధత, నిష్కాపట్యము, సాధుత్వము అతణ్ని ప్రీతిపాత్రుణ్ని, జనానురాగపాత్రుణ్ని చేశాయి.

విలియం కోల్ మన్ ఆండ్రూకు మరో పొరుగువాడు. ఇతడు పిట్స్‌బర్గులోని ధనికుల్లో ఒకడు. ఇనుము పరిశ్రమ అధిపతి. కళాపోషకుడు. పిట్స్‌బర్గు ఆపేరా గృహానికి చిరకాలం యజమాని. పిట్స్‌బర్గ్, హోమ్‌వుడ్ లలోని యువకుల దృష్టిలో ఇతనికున్న గొప్ప సంపద ఇతని అందమైన అయిదుగురు కుమార్తెలు. వీళ్ళల్లో ఇరువురు థామస్, మిల్లరెకు ఒకతె, థామస్ యం. కార్నెగీకి ఒకతె భార్యలైనారు.

1859 లో పెన్సిల్వేనియాలో నూనెను కనుగోటం జరిగిన తరువాత మిస్టర్ కోల్ మన్ ఆండ్రూలు ఇరువురూ అలిఘనీ వరకు పరిశీలన యాత్ర చేశారు. వాళ్లు వీలు చిక్కినప్పుడు నిద్రిస్తూ, అందినచోట భోజనం చేస్తూ అనేకదినాలు మిట్టపల్లాలతో గూడిన నీలారణ్య దేశంలో సంచారంచేశారు. మిస్టర్ కోల్‌మన్ ఆండ్రూలు కొద్ది బేరం సాగిన తరువాత నూనె ఉన్నట్లు నిరూపితమైన భూమికి సన్నిహితంగా వున్న ఒక క్షేత్రాన్ని ఎంతైనా సరే పెట్టి జూదమాడ దగ్గదాన్ని అన్ని హక్కులతో నలభై వేల డాలర్లకి కొనగలిగారు. తరువాత కాలంలో, అంటే నూనె లాభాలు విశేషంగా ఉన్నప్పుడు, కనిపించినట్లు లాభాపేక్ష గలవారు, అప్పుడు అట్టే