పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్తిగా చెల్లించక పూర్వమే విలియం కార్నెగీ కొద్దిగా జబ్బుచేసి తన ఏభైయ్యోయేట మరణించాడు. "తగిన విశ్రాంతిని, సౌఖ్యాన్ని మేము ఇవ్వగల శక్తిని సంపాదిస్తున్న సమయంలో ఆయన మృతినొందా" డన్నాడు ఆండీ. సాధుశీలుడు, నిరాడంబరుడు అయిన తండ్రి మరణించినందుకు కుటుంబమంతా చింతలో మునిగింది. పెద్దకుమారుడు ఎప్పుడూ అతణ్నిగురించి అత్యుదాత్తుడు. ప్రేమార్హుడు అయినటువంటి వ్యక్తిని తాను మరొకణ్ణి ఎరగనంటుండేవాడు.

తండ్రి వ్యాది, మృతి ఆండ్రూమీద, అతని తల్లిమీద మరికొంత ఆర్థిక భారాన్ని పడవైచినవి. తల్లి తిరిగి పాదరక్షలను కుట్టటం ప్రారంభం చేసింది. ఈ పరిస్థితిలోనే ఒకనాడు మిస్టర్ స్కాట్ "ఆండీ! నీదగ్గిర అయిదు వందల డాలర్లు వున్నవా" అని ప్రశ్నించాడు.

ఆండీ జీతం ఇప్పుడు నెలకు ముప్ఫై డాలర్లకు పెంచబడినది. తానే జీతాలు బట్వాడా చేస్తుండేవాడు గనుక అతని కంటికి ప్రపంచంలో అత్యుత్తమ లలిత కళాఖండాలుగా కనిపించె రెండు పక్షీజంటలున్న బంగారు నాణాల రూపంలో అతడు దాన్ని పుచ్చుకునేవాడు. అయితే అనుకోకుండా వచ్చిపడే యిబ్బందులవల్ల వాటిని వెంటనే కరిగిస్తుండేవాడు. పై అధికారి ప్రశ్నించినప్పుడు అతనిదగ్గిర అయిదు వందల సెంట్లుకూడా లేవు.

అతడు సమాధానం చెప్పెలోగానే, తన యువకు ----------------------------బిత్తరచూపును పట్టించుకో