పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డప్పుడూ చిన్న చిన్న రచనలు చేస్తుండేవాడు. ఈ చిన్న రచనల్లో ఒకటి యుద్ద వ్యతిరేకతను నిరూపించేది అయి వుండటం ముఖ్యంగా గమనింపదగ్గ విషయం దీనిని అతడుతన పద్ధెనిమిదౌ యేట క్రిమియాలో ఇంగ్లండు రష్యామీద యుద్ధం చేస్తున్న మొదటి సంవత్సరం వ్రాశాడు. అతడు చర్చిలో పాట పాడుతుండేవాడు. సంగీతం వినటమంటే అతడికి మంచి ఆసక్తి, అయితే చర్చి సంగీతపు నాయకుడు ఒప్పుకొన్నట్టు అతడి కంఠంలో ఆశించదగ్గది ఏదో కొంత ఉంది. ఏమైనా, ఎప్పటిలాగేనే అతనికి ఈ అనుభవంవల్ల కొంత లాభం కనిపించింది. అది తరుచుగా పాడే 'బాఖ్‌కోరల్స్‌' మీద క్రొత్త అభిలాష కలగటం, మంచి సంగీతాన్ని ప్రశంసించగల శక్తి పెరగటం, మంచి సంగీతమంటే అభిరుచి ఏర్పడటం.

స్కాచ్ వారైనప్పటికీ అతని తలిదండ్రులు ఆలోచనారీతిలో ఉదారత ఉన్నవాళ్ళని చలికాలంలో ఒక శనివారంనాడు అలిఘనీనది గట్టిగానురుపుగా గడ్డకట్టినపుడు నిరూపితమైంది. ఆదివారంనాడు ఆటపాటలంటే స్కాచ్ వారు ఎంతపట్టుదల వహిస్తారో జ్ఞప్తికుండి కూడా స్కేటింగ్ అంటే అతిప్రీతిగల ఆండీ ఆనాటి సాయంత్రం కొంత అనుమానిస్తూనే తల్లిదండ్రులతో "రేపటి ఉదయం చర్చికి వెళ్ళబోయేముందు కొద్దిసేపు నేను స్కేటింగ్ చేయవచ్చునా" అన్నాడు.