పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నేను త్వరలో తెలుసుకొంటాను" ఆదుర్దాతో వణికిపోతూ ఆండి మధ్యలో జోక్యం కల్గించుకొని అన్నాడు.

"కాదు, కాదు" అన్నాడు తండ్రి. "నీవు అందులో చేరవద్దు".

పనిచేసుకొంటూనే విషయాన్ని గురించి ముందు వెనుకలు ప్రశాంతంగా ఆలోచిస్తూన్న తల్లి ఈ క్షణంలో తన నిర్ణయాన్ని బయటపెట్టింది. ఆమె అన్నది: "చేరడమేఆండ్రాకూ చాలా మంచిది. నా అభిప్రాయం" "అల్లిక దారపు కర్మాగారంలోనే అతడు నిరంతరం పనిచేస్తుండాలని మనం అనుకోటానికి వీల్లేదు. అక్కడ అతడి అభివృద్ధికి ఎటువంటి అవకాశం లేదు"

"నేను దానిలోనుంచి బయటపడదా మనుకుంటున్నా" నన్న ఆండీ గొంతు భావోదేగ్రంవల్ల గాద్గద్యం వహించింది. "అట్టినూనెకంపును ఒక్క క్షణకాలంకూడా నేను భరించ లేనని ఎన్నో తడవలు అనుకుంటుండే వాణ్ని".

అతనివంక తండ్రి ఆశ్చర్యంతో చూశాడు. ఈ వ్యతిరేక భావాన్ని గురించి అతడికి తెలియదు.

"ఈ విషయం మాకు ఎందుకు చెప్ప"లేదని తల్లి అడిగింది.

"మీకు ఇబ్బంది కలిగించటం నాకు ఇష్టం లేకపోయింది".

"మిస్టర్ బ్రూక్స్ రేపు తన్ను కలుసుకోమన్నా" డన్నాడు అంకుల్ టాయ్. తంతి కార్యాలయం ఫోర్తు అండ్ వుడ్ వీధులమధ్య వుంది".