పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/36

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్ల మాకు తంతులను బట్వాడా చేసేటందుకు మరొక వార్తాహారి బాలుడు కావలసి వచ్చాడు. మంచివాడు, గట్టిగా నమ్మదగ్గవాడు మీ కెవరైనా తెలుసునా !" అన్నాడు.

మిస్టర్ హోగన్ తన మనుష్యుల నందరినీ ఒక్కమారు చివరవరకూ జ్ఞాపకం చేసుకొనిక్షణమాలోచించాడు. "నా కొక నెప్వూ వున్నాడు. వాడు ఈ పని చెయ్యవచ్చు. పేరు ఆండ్రూ కార్నెగీ, క్రొత్త డాలర లా మెరుస్తుంటాడు. నమ్మదగ్గవాడు. మనస్ఫూర్తిగా పనిచేస్తాడు. ఎంతపనికీ వెరవడు" అని తరువాత అన్నాడు.

"వయస్సెంత!"

స్మృతికి తెచ్చుకొని అంకుల్ టాయ్ అన్నాడు "పదునాలుగున్నర వయసులో చిన్నవాడయినా వయసుకు మించిన చురుకుతనం వున్నవాడు. అటువంటి బాలుడికి మీరే మిస్తారు!"

"వారానికి రెండున్నర డాలర్లు. ఇది అతడికి తృప్తిగా వుంటే నా కార్యాలయానికి పంపించి నాతో మాట్లాడమంటారా!"

"అలాగే చేస్తాను."

మిత్రులిద్దరూ ఆట పూర్తిచేశారు. వెంటనే మిస్టర్ హోగన్ కార్నెగీల ఇంటికి వెళ్ళాడు. అప్పటికి సాయంకాలం చాలవరకు గడిచిపోయింది. అయినా మిసెస్ కార్నెగీ చెప్పులు కుడుతున్నది.

అంకుల్ టాయ్ తెచ్చిన వార్తమీద ఉల్లాసకర