పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

హోగన్ వొక క్రోకరీ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. సుఖపదమయిన చిన్ని రెండతస్తుల ఇంట్లోవుంటూ దానికి అద్దె చెల్లింప గలుగుతున్నాడు. చాలా సంవత్సరాలకు పూర్వమే భర్త చనిపోయిన ఆంట్ ఐట్కిన్ ఇప్పుడు ఒక చిల్లరదుకాణానికి యజమానురాలైంది. అంకుల్ టామ్ సోదరుడయిన ఆండ్రూ హోగన్ ఆంట్ ఐట్కిన్ నివసిస్తున్న ఇంటికి చివరలో ఉన్న చిన్న ఇంట్లో వుంటూ నేత నేస్తుండేవాడు. ప్రస్తుతం అందులో నుంచి మారబోతున్నాడు. ఆంట్ ఐట్కిన్ దాన్ని కార్నెగీలకు ఇచ్చింది.

"అన్నా ! అద్దె యెంత వుంటుంది !" అని విలియం అడిగాడు.

"మీకు కొంత నిలువ దొక్కుకున్నదాకా ఏమీ వుండదు" అన్నది దయామూర్తి ఆ ఆంట్. విలియం అందుకు అభ్యంతరం చెప్పాడు కాని ప్రస్తుతం అతనికి అంత కంటే గత్యంతరం లేదు.

ఇక ఇప్పు డతడు, వెనక స్కాట్లండులో చేస్తున్నట్లుగానే చేనేతపని ప్రారంభించాడు. అయితే అమెరికాలో చేనేతను మరమగ్గాలనేత అతివేగంగా త్రోసిపుచ్చటంవల్ల అతడు అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఇబ్బందులమధ్య పనిచేయ వలసి వచ్చింది. డన్ఫ్‌ర్మ్‌లైన్‌లో నేసిన వాటికంటే చౌకరకం బల్లగుడ్డలను, తీసిపారవేయదగ్గ ప్రత్తి జాతి గుడ్డలను నేసి విలియం ఇంటింటికి తిరిగి అమ్ముతుండేవాడు. ఈ సమయంలో అతడిభార్య చెప్పులు కుట్టుట మనే ప్రాతపనిని