పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/261

ఈ పుటను అచ్చుదిద్దలేదు

A QUALITY PUBLICATION

ఆండ్రూ కార్నెగి

ఆండ్రూ కార్నెగీ 1835 వ సంవత్సరంలో స్కాట్ లాండ్ లో జన్మించాడు. ఆయన తన 12 వ ఏట అమెరికా దేశానికి వలస వచ్చాడు. అక్కడే ఆయన అ కాలంలోని ఉక్కు ఉత్పత్తి దారులలో ప్రథముడిగా గణుతి కెక్కాడు. 1901 వసంవత్సరం వచ్చేనాటికి బాగా ధనార్ఝన చేసి ముప్పయికోట్ల రూపాయలకు పైగా ధర్మకార్యాలకు ఖర్చు పెట్టాడు. 1919 వ సంవత్సరంలో ఆయన మరణించేనాటికి అనేక విద్యా సంస్థలకు విరివిగా దానాలు చేశాడు.

అంతేగాక అనేక ధర్మసంస్థలకు, ధర్మకార్యాలకు ఎంతో ధనాన్ని వ్యయంచేశాడు. తన సహాయం పొందినవారు పైకి రావాలనేది ఆయన అభిలాష.

ప్రపంచ చరిత్రలో పేర్కొనదగిన మహాదాతలలో ఒకరిగా కీర్తి నార్జించాడు ఆండ్రూ కార్నెగీ.