పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/241

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కున్నాము. అతడు నిరాశా వాది. రానున్న ఆపదల విషయంలో అతడు చింతాత్మకంగా, కొన్ని మారులు అంధకార ప్రాయంగా చూస్తుంటాడు. కొన్ని సందర్భాలలో లేనిపోని వేవో అర్ధరహితమయిన వాటిని ఊహిస్తూ వుంటాడు. నా పిల్లలన్ని అంచబిడ్డలైనా యికనొక నేను ఆశావాదిని. నాకు లోకం తేజో వంతంగా కనిపిస్తుంది. పలుమారులు ఈ అవనియే సత్యమయిన అమలిన స్వర్గంగా నాకు గోచరిస్తూంది. నేను యింత సంతోషంతో వుంటాను. దయామయు లయిన 'విథి దేవతలకు కృతజ్ఞుణ్నీ. ఎన్నడూ మోర్లీ దాన్ని గురించి కూడ వుద్రేకి కాలేదు. అతని నిర్నయా లెప్పూడూ ఆలోచనా పూర్వకములయినవి. అతని కన్ను లెప్పుడు ఆదిత్యునిలోని మచ్చల మీదనే దృష్టి నిలిపి చూస్తూంటాయి.

అయినా మోర్లీ తనమిత్రుని ఆశాభావం, వుత్సాహం అన్న వాటికీ చూచి ఎంతో యిష్టపడుతుండేవాడు. ఆ ఆశాభావంతో ఎల్ల వేళలా ఆతడు ఏకీభవించ లేకపోతుండేవాడు. అతడు అన్నాడు "విజ్ఞానం విజ్ఞానతృప్తి, నూతన వస్తువులలో కనుగోటం, భావజ్యోతిని ప్రసాదించటం, సాంఘిక సంబంధాలను వృద్ధి పొందించటం తుల్య ప్రజ్ఞకు తుల్య మయిన అవకాశాలు కలిగించటం, శాంతిప్రియత్వం అన్న ప్రపంచమందలి ఉత్తమాశయాలకోసం అతడు పొందిన విస్తారమైన అనుభూతికి తగిన న్యాయాన్ని జరిపించటం వివేకం ఇవన్నీ మహోన్నత విషయాలు. వాటిని గురించి ప్రకటించేటప్పుడు అత్యుక్తి లేశం వుంటె వుండవచ్చును. దాన్ని సర్దుకోటం చాలా సులభం." ఈ ఆదర్శాల విష