పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/238

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీరుబడి లేకుండా ఉన్నావా? అది ఎలావున్నా, మరి శాంతికి కాకపోతే నే నెందు కుపయోగపడేటట్లు?

కొన్నాళ్లు గడచిన తరువాత డాక్టర్ లైమన్ బీచర్ ను వెంట పెట్టుకొని ముందు వచ్చిన వున్న వారిని కూడా కలుపుకొని కార్నెగీని చూడటానికి వెళ్ళారు. కార్నెగీ వా రే పనిమీద వచ్చారో ముందే ఊహించాడు.

"మీరు ఒక మాటైనా చెప్ప వలసిన పని లేదు" అంటూ వారిని లోపలికి రమ్మని ఆహ్వానించాడు. "మీ రిక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మొన్న నేను మీరు ఇస్తామన్న అధ్యక్ష పదవిని కాదని త్రోసిపుచ్చినప్పటినుంచీ నా అంతరాత్మ నన్ను బాధిస్తున్నది. ఇప్పుడు నేను మనస్సు మార్చు కొన్నాను. ఆ అధ్యక్ష పదవిని స్వీకరిస్తాను. నాకర్తవ్యాన్ని నిర్వహిస్తాను.

ఆ తరువాత వచ్చిన వసంతంలో ఆ సమాజం న్యూయార్క్‌లో శాంతిమహాసభ జరిపించింది. సమాఖ్యలోని రాష్ట్రా లన్నింటిలోనుంచి ప్రతినిధులు, విదేశాలనుంచి అనేక మంది ప్రఖ్యాత పురుషులు సభకు విచ్చేశారు. మానవజాతి మధ్య శాంతిని నెలకొల్పా లంటే సభలు జరపటం, వుపన్యాసాలివ్వటం, తీర్మానాలు చెయ్యటం కంటే ఇంకా మించిన పని ఏదయినా చెయ్యాలన్న విషయం స్పష్టపడింది. ఇందుకు మరొక మార్గ మేదీ గోచరింపక పోవటంవల్ల తన చేతిలోవున్న శక్తిమంతమయిన సాధనాన్ని ధనాన్ని ప్రయోగించటానికి నిశ్చయించాడు కార్నెగీ. అది ఆయన యిత రాశ