పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/235

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1906 లో కొద్దికాలం గడిచిన తరువాత సెయింట్ ఆండ్రూస్‌కు కార్నెగీని మూడోమారు డైరెక్టరుగా ఎన్నుకున్నారు. ఆ వేసవిలో జరిగిన ప్రిన్సిపాల్స్ వారోత్సవాలల్లో మిస్ అగ్నిస్ ఇర్విక్ కార్నెగీల యింట్లో అమెరికన్ అతిథిగా వుంది. ఈమె రాడ్‌క్లిప్ కాలేజీకి డీన్ బెంజిమిన్ ప్రాన్‌క్లిన్‌కు మునిమనుమరాలు. సెయింట్ ఆండ్రూస్ ప్రిన్సిపాల్ డొనాల్డ్ సన్, అతడేకాదు మిగిలిన అతిధులందరూ, స్కి బోకు అతిథిగా వచ్చన ఈమెవల్ల ప్రభావితులైనారు. ఈమెరాక కెంతో సంతోషించారు. ఇందుకు కారణం సెయింట్ ఆండ్రూస్ 1759 లో బెంజిమిన్ ప్రార్స్‌క్లిన్‌కు అతని మొదటి గౌరవపట్టాన్ని ఇవ్వటం జరిగింది.

ఆ సంవత్సరమే ఫిలడల్పియాలో ప్రాన్‌క్లిన్ ద్విశత వార్సోత్సవం జరుగుతుంటే నూటనలభే యేడు సంవత్సరాలకు పూర్వం ఆమె ముత్తాతకు ఇచ్చిన గౌరవపట్టాన్ని మిస్ ఇర్విన్‌కు పంపించింది. ఆ విశ్వవిద్యాలయం తమరెక్టర్ పదవిని అనుభవిస్తున్న ఆండ్రూ కార్నెగీని ఆమె కా ఉత్సవ సందర్భంలో పరిచయంచేసి ఆమె భుజాలమీద ఆ హుడ్‌ను వుంచవలసిందిగా కోరారు.

ఇప్పుడు ఎ. సి. వింతైన సమయాలల్లో తన ఆత్మకథకు సంబంధించిన ప్రకరణాంతర్భాగాలను, ప్రకరణాలను వ్రాసుకుంటున్నాడు. ఈ సమయాలల్లో అతడు ఎవరిని గురించి తాను వ్రాయటం జరుగుతున్నదో అట్టి తన ప్రియమయిన మిత్రులు, బంధువులు, ఇతరు లనేకులు మృతినొందిన అంశాలని చింతతో స్మృతికి తెచ్చుకొన్నాడు.