పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/232

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నప్పుడు వీరికి కలిగిన భావాల్లో ఒకదానిని తాను మెచ్చుకొని కార్నెగీ తాను ఎంతో ప్రీతిని వహించే మిత్రుల పట్టికలో వారిని చేర్చటం జరుగుతుండేది. కార్నెగీ మిత్రుల పట్టికకు ఎప్పుడూ అంతు అనేది లేదు.

రెండు సంవత్సరాలైన తరువాత మరికొంత మొత్తం 50,00,000 (యాబై లక్షల) డాలర్లు, తరువాత మరొకమారు 12,50,000 (పన్నెండు లక్షల యాబైవేల) డాలర్లు కార్నెగీ ఆ ఫౌండేషనుకు చేర్చాడు. 1918 లో కార్నెగీ కార్పొరేషను దానికి 1,20,00,000 (ఒక కోటి ఇరవై లక్షల) డాలర్లు విరాళమిచ్చింది. మొదటి పాతిక సంవత్సరాలల్లో ఇది పదకొండు వందలమంది ఉపాధ్యాయులకు వారి విధవలకు ఎలవెన్స్, పెన్షన్ల రూపంలో 2,00,00,000 (రెండు కోట్ల) డాలర్లు వినియోగించింది. కార్నెగీ ఫౌండేషను, జాన్ డి. రాక్ ఫెల్లర్ జనరల్ ఎడ్యుకేషన్ బోర్డు అన్న సంస్థలు ఒకటి చేస్తున్న పనినే మరి రెండవది చేస్తున్నట్లు కన్పించినప్పుడు మిష్టర్ రాక్ ఫెల్లర్ "మీరు మా బోర్డులో యెందుకు సభ్యులుగా చేరకూడదు. అప్పుడు రెంటిలో ఏమిజరుగుతుందో మీకు తెలుస్తుంది. దానివల్ల చేసిన పనిని తిరిగి చెయ్యటమనే దాన్ని నిలిపి వెయ్య వచ్చు" అని కార్నెగీతో అన్నాడు. కార్నెగీ ఉభయ నిధులకు ఉపయోగించేటందుకు గాను రాక్ ఫెల్లర్ జనరల్ ఎడ్యుకేషన్ బోర్డులో సభ్యుడైనాడు.

ప్రసిద్ధ సంపాదకుడు, విమర్శకుడు, అతనికి సన్నిహిత