పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/221

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంకించారు. వీరోచిత కృత్యాలకు ఇది ఉద్భోధకముగా ఉండటంచేత బహుమతికోసం సాహాసచర్యలను ప్రేరేపించటం దీని ప్రయోజనమౌతుందని ఈ పధకాన్ని విమర్శించే వారు ఊహించారు. అయితే దాత మనసులోకి అటువంటి అభిప్రాయం ఎన్నడూ రాలేదు. "నిజమైన వీరు లెన్నడూ బహుమతిని గురించి ఆలోచించారు" అని కార్నెగీ అన్నాడు. వారు దివ్యోద్రేకం కలవాళ్లు. తమను గురించి కాకుండా ఎల్ల వేళలావారు ప్రమాదస్థితిలో వున్న తమవాళ్ళను గురించి ఆలోచిస్తారు.

పరిశీలకులు వెదికి తనముందుకు కొన్ని సంఘటనలు తీసుకో వచ్చినప్పుడే ఈ కమీషన్ వ్యవహరిస్తుంది. "మానవుల ప్రాణాలను రక్షించటంలో వీరోచితయత్నం చేసి దెబ్బతిన్న వాళ్ళకు తిరిగి పనిచేసుకో గలిగేటంతవరకూ ఇది ఆర్థిక సహాయమిస్తుంది. ఇటువంటి యత్నంలో మరణించినప్పుడు, ఆతని భార్యకు, బిడ్డలకు, ఇంకా అతనిమీద ఆధారపడే వాళ్ళకు - ఆమె పునర్వివాహం చేసుకుండేదాకా, పిల్లలు తమ్ము తామే పోషించుకునే వయస్సు వచ్చేదాకా జీవిత యాత్రకు వీలు కల్పిస్తుంది. వీరుడు గాయపడకపోయినప్పటికీ ఇటువంటి పారితోషికం ఇవ్వటం ఉచితమని కమీషన్ భావిస్తే అతనికి కొంత డబ్బును ఇవ్వ వచ్చు. ఆ వీర కృత్యాన్ని తెలియ జేసే రచనతో ఒక పతకాన్ని ఆ వీరుడికి గాని, అతని భార్యకుగాని, లేదా తరువాతి సన్నిహిత బంధువులకు గాని ఇవ్వవచ్చు.