పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టి కూరగాయలు, పండ్లు, తీపివస్తువులు అమ్ముతుండేది. మధ్య మధ్య చి తమైన సమయాలలో సాయంతనవేళల్లో సోదరుడైన ధామస్ మో'సస్ కోసం ఆ అనురాగమూర్తి స్థిరసంకల్పంతో పాదరక్షులు కుడుతుండేది. మా'సన్ పాదరక్షల వ్యాపారి. ఇతడు కేవలం చెడిపోయిన వాటిని బాగుచేసి ఇచ్చేవాడు మాత్రమే కాడు. అనేకమంది పనివాళ్ళను పెట్టుకొని పాదరక్షలను ఉత్పత్తిచేసే పెద్ద వ్యాపారి. అప్పటికి ఇంకా పాదరక్షలను యంత్రాలమీద ఉత్పత్తి చేసే విధానం రాలేదు. ఆండ్రూ అమ్మ పక్కన కూర్చొని సూదులకు దారా లెక్కిస్తూ దారలకు మైనం రాస్తూ మధ్య మధ్య వీలు చిక్కినప్పుడల్లా కొంత కాలాన్ని చదువుకోటం కోసం వినియోగిస్తుండేవాడు. రోజల్లా అతనికి ఏదో పనివుంటుండేది. వీధికి పైగా ఒకటో రెండో ఇళ్ళ వరుసలుదాటి వెళ్లీ అక్కడ ఉన్న ఉమ్మడి బావినుంచి కడివెడు నీళ్లు తీసుకు రావటం అతని మొదటి కర్తవ్యం. అక్కడ అతడు స్త్రీలు, బాలురు, బాలికలతో వున్న ఒక వరుసలో చేరి అనేకమందిలో తనవంతు వచ్చేదాకా నిలచి వుండవలసి వచ్చేది. తరువాత ఎక్కువకాలం బళ్లొ గడపి ఇంటికి వస్తే చెప్పిన చిన్నపనులకోసం అటూ ఇటూ వెళ్ళి వచ్చేటప్పటికల్లా భోజనపు వేళ అయ్యేది.

'మాన్ వాజ్ మేడ్ టు మోరన్‌' అన్న బరన్స్‌కవి పద్యం కంఠస్థంచేసినందుకు మిష్టర్ మార్టిన్ అన్న గట్టిపట్టు దలగలవాడైన వృద్ధోపాధ్యాయుడు అతనికి పారితోషికంగా ఒక పెన్నీ ఇచ్చాడు. కుటుంబంలోని వాళ్లవల్ల కాకుండా