పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/219

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న్యూయార్క్‌లో ఈ గ్రంథాలయాలను నిర్మిస్తున్న దినాలల్లోనే 'వాషింగ్టన్ కార్నెగీ ఇన్ట్సిట్యూటు ప్రారంభమైంది. దానికి స్థాపనోత్సవం జరిగినది. జనవరి 28 , 1902 న "పరిశోధన, క్రొత్త విషయాలను కనుక్కోటం, మానవాభ్యుదయానికి విజ్ఞానాన్ని వినియోగించటం అన్న విషయాలను పెంపొందించటంకోసం" నిర్మాత దీనికి 2,50,00,000 (రెండు కోట్ల ఏభై లక్షల) డాలర్లు దానమిచ్చాడు. థియొడోర్ రూజ్ వెల్టు క్రింద సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా వున్న జాన్ హో దీని బోర్డుకు మొదటి అధ్యక్షుడు. వాషింగ్టన్ లోని దీని ఆర్థిక - సాంఘిక శాస్త్రము, చారిత్రక పరిశోధన, జియొఫిజికల్ డిపార్టుమెంటులే కాక, దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చోట్ల నడుస్తుంటివి. ఆరీజోనా ఎడారిమీది బొటానికల్ లాబొ రేటరీ, ప్లోరిడో తీరానికి దూరంగా డ్రైటార్టుగస్ ద్వీపాల్లోని మెరైన్ బయొలాజికల్ లాబొరేటరీ, దాని గొప్ప టెలిస్కోపుతో కాలి ఫోర్నియాలోని మౌంట్ విల్సన్ లాబొరేటరీ, న్యూయార్క అల్బనీలోని అబ్జర్వేటరీ, సముద్రాలపై ప్రయాణం చేస్తూ పూర్వం రూపొందించబడ్డ సర్వే పటాలను సరొదిద్దుతున్న చిన్న నౌక - ఇంకా యిందులోనివి ఎన్నో వున్నవి.

తరువాత తనకు అతి ప్రియమైనది కానున్న హిరోఫండు కమీషను నెత్తుకున్నాడు. 1904 లో 50,00,000 (యాబై లక్షల) డాలర్లు ఇచ్చి దీనిని ప్రారంబించాడు. ఈ వంకకు ఆతని బుద్ధి మరలించినది పిట్సుబర్గుకు సమీపంలో ఉన్న బొగ్గు గనిలో జరిగిన విషాద సంఘటన. గనిలో ఒక