పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/214

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్ట్రీట్లకు మధ్య అత డొక నూతన గృహాన్ని నిర్మించాడు. కుటుంబం 1902 లో ఆ నవమందిరానికి మారింది. అది చాలా విస్తీర్ణం కలది దాన్ని నిర్మించుకొన్న యజమానిలా బలిష్ఠము; చోకము అయినది దాని నమూనా అతిసామాన్య మయినది. దానిచుట్టూ వున్న నేల వసంతం మొదలు వేసగి వరకూ వుండే పూలతో కళకళలాడు తుండేది. ఆ గృహ యజమాని శయ్యాగృహంలో గోడమీద ఒక బొమ్మ వ్రేలాడు తుండేది. అది బిల్ జోన్స్ చిత్రం.

కార్నెగీ కార్పొరేషన్ రద్దయిన తరువాత పూర్వం దానిలో భాగస్థు లయిన వాళ్లు, వీరు మొత్తం నలుబదిమంది వారిలో చివరివాడుకూడా మరణించేటంత వరకు పూర్వపు జీవిత స్మృతులను నిలుపుకోటం కోసం కార్నెగి వెటర్నెన్సు ఎసోసియేషన్ అన్న పేరుతో ఒక సంస్థను స్థాపించుకొన్నారు. నూతన గృహనిర్మాణం పూర్తిఅయిన తరువాత మిసెస్ కార్నెగి తన భర్తకు సంతోషకరంగా "ప్రధమంగా మనం కార్నెగి వెటరన్లను ఆహ్వానిద్దాం" అన్నది. వారు విందుకు వచ్చినపుడు గృహానికి శుభాకాంక్షలు పలికారు. 'వెటరన్సు డిన్న' రన్నది. తరువాత ప్రతిసంవత్సరం ఆ క్రొత్త యింట్లో ఒక ఆచారంగా జరుగుతూ వచ్చింది. అందరూ దీనికోసం ఎదురు చూస్తుండేవాళ్లు. సంవత్సర మంతటిలో అనుభవించు ప్రముఖమైన ఆనంద సమయాలల్లో ఇది ఒకటి కావటంవల్ల అలా ఎదురుచూసే వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఆతిథేయి కార్నెగి. ఆ వెటరన్లను "నా బాలుల్లారా!" అని కార్నెగి పిలుస్తుండేవాడు. వారు తనయెడ