పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

వుంది. యౌవనవేళ అతడు సాహిత్యంలో ద్వితీయసానాన్ని సర్ వాల్టర్ స్కాట్‌కు ఇచ్చాడు.

తండ్రికి వున్న గ్రంధపఠనాభిలాష కొన్ని వేళల్లో అతని పనికి అడ్డువస్తుండేది. అతడికి డికెన్స్ నవల లంటే గాఢమైన గౌరవం. అవి ముప్పదిరెండు పుటలలో చిన్న కరపత్రాలుగా, నెల కొక ప్రకరణంగా వస్తుండేవి. స్థానికంగా వార్తాపత్రికలను అమ్మే ఒకవ్యక్తి వాటిని పంచి ఇస్తుండేవాడు. ఇతడు "ఆండా! సుప్రభాతము! 'ది ఓల్లు క్యూరియాసిటీ షాఫ్‌' క్రొత్త సంచిక ఇదిగో!" అంటూ ఇంట్లో ప్రవేశించగానే లిల్లీ కార్నెగీ దాన్ని ఆతురతతో లాక్కునేవాడు. అంతటితో అతని మగ్గం ఆడటం మానేసేది. ఎంత తొందరైన నేతపని వున్నాసరే డికెన్సు అతణ్ణి అలా సమ్మోహితుణ్ణి చేసేవాడు. అయిదు...పది...పదిహేను నిమిషాలు కథను మ్రింగివేస్తున్నట్టుగా చదివి ఎలాగో యత్నంమీద త్రెంచుకుని బయటపడి మళ్ళీ ఆసుక్రోనిని అతివేగంగా ఆడించేవాడు. మళ్ళీ మగ్గం కోప తీవ్రతతో ధ్వనిస్తూ పని చేసేదిమధ్యలో అతడిభార్యపై అంతస్థులోకూచుని ఆసుక్రోనికి అందించటం కోసం నూలును కండెలకు చుడుతుండేది. లిల్లీకి మధ్యలో ఒక ఆడపిల్ల పుట్టిపోయిన తరువాత ఆండ్రా కలిగిన ఆరేండ్లకు మరొక మొగశిశువు జన్మించాడు. అందువల్ల ఆమె కొన్నివేళలలో నూలుకండె చుడుతూనే కాలితో ఉయ్యాలను ఊపుతుండేది.

ఇంటి నేత పరిశ్రమ పడిపోతున్నదని, ఆ స్థానాన్ని