పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/165

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వామ్యం ఇచ్చినట్లే తరువాత స్క్వాబ్‌కు కూడా భాగస్వామ్య మిచ్చి భాగస్థుణ్ని చేయటం జరిగింది. అతనికోసం కార్నెగీ కార్పొరేషనులోని కొన్ని వాటాలను అసలు విలువకు అమ్మటం జరిగింది. వాటినే స్టాక్ ఎక్‌స్చేంజిలో పెడితే ఎంత వచ్చేదో చెప్పటం కూడా జరగ లేదు. డివిడెండ్ల నుంచి ఈ డబ్బును అతడు అతి వేగంగా చెల్లించాడు. అతడు తరువాత మహా భాగ్యవంతు డయినాడు. ఇలా ఎన్నుకోబడ్డ యువక భాగస్థులందరూ భాగ్యవంతులయినారు. కార్నెగీ గ్లౌసెస్టర్ ఫిష్షింగ్ ప్లిట్ తన దృష్టిలో ఆదర్శమయిన వ్యాపార సంస్థ అని చెపుతుండేవాడు. అందులో జీతంపుచ్చుకొనేవాళ్ళంటూ లేరు. అందరూ లాభాలు పంచుకునే వాళ్ళే.

మనుష్యుల గుణ నిర్ణయం చెయ్యటంలో కార్నెగీ మహా ఘటికుడు. అతడు ఒకణ్ని మంచివాడని నిశ్చయించుకున్న తరువాత అతడిమీద గొప్ప విశ్వాసముంచేవాడు. స్క్వాబ్ మీద అతడుంచిన విశ్వాసం దరిదాపుగా పరిపూర్ణమయినది. అతని పై అధికారిని కార్నెగీ స్క్వాబ్‌ను క్రొత్త కన్వర్టింగు మిల్లును కట్టనీయవలసిందని త్వరపెట్టాడు. "ఆమిల్లును నిర్మించటంవల్ల మనం టన్నుకు యాభై సెంట్ల ఉక్కును పొదుపు చెయ్యగల"మని అతడు వాగ్దానం చేశాడు.

అది కార్పొ రేషన్ దేశంలో మిక్కుటంగా ధనమున్న సమయం కాదు, అయినా తుదిమాటగా కార్నెగీ "మంచిది. సాగిపొండి!" అన్నాడు.