పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

అన్న పాతకాలపు స్కాచ్ వీర గీతాలను, పాడుకుంటూ పాడటంకంటె గొణుగుకుంటూ ఉండే సిగ్గరి, సాధువు అయిన తన తండ్రి అంటే ఆండ్రూకు ఎంతో భక్తి.

"13 4లో బానాక్‌బర్న్ యుద్ధానికి ముందు ఇంగ్లీషు సైన్యానికి ఎదురుగా నిల్చిన తనసైన్యాన్ని ఉద్దేశించి రాబర్టు బ్రూస్ చేసిన ప్రసంగంగా ఈ 'స్కాట్స్...' అన్న గేయం ఊహింప బడుతున్నదని తన తండ్రి పాటను తొలిసారిగా మధ్యలో ఆపి తనకు చెప్పి తిరిగి ఎత్తుకొని ఎప్పుడు పాడాడో ఆండ్రూకు జ్ఞాపకంలేదు. కొన్ని సమయాలల్లో అతడు ఇది కూడా చేర్చి చెపుతుండేవాడు: "రాబర్టు బ్రూస్!" - మన మొదటి రాబర్టు బ్రూస్ రాజు అయినది ఇతడే. బుజ్జీ! నీకు తెలుసునా? అయిదు వందల సంవత్సరాలకు పూర్వం ఇంగ్లీషువారినుంచి స్కాట్లండ్ దేశానికి విముక్తిని కలిగించిన ఇద్దరిలో ఇత డొకడు. రెండవవాడు సర్ విలియం వాలెస్" అతడు ఆసుక్రోలిని ఎడమనుంచి కుడికి, మళ్ళీ వెనకకు ఆడించేవాడు. "భ్రూస్‌ను ఇక్కడే డంఫ్‌ర్మ్‌లైన్‌లోని అబ్బీలో ఖననం చేశారు...అతడు అతనిరాణి, అనేకమంది మన రాజులు రాణులు ఎంతోదూరం నుంచి మాల్కొ కాన్మోరుకు వచ్చారు. అతని రాణి మార్గెరెట్. ఆమే 1075 లో ఈ ఆబ్బీని స్థాపించింది" అని అతడు చెప్పేవాడు.

స్కాట్లండ్‌కు మధ్య యుగంలో రాజకీయ మత విషయిక ముఖ్యనగరం కావటంవల్ల ఊన్ఫ్‌ర్మ్‌లైన్ వాస్తవికంగా ఒక చరిత్రాత్మకమైన చిన్న నగరం. అందులోని