పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/139

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమ్మరించట మెందుకు?" అని సుఖంగా కుర్చీలో వెనక్కు వ్రాలుతూ అతడు సలహా యిచ్చాడు.

ఇతర భాగస్థులంతా టామ్‌తో ఏకీభవించారు. ప్రయోజనంలేక వాదన కొంత సాగించిన పిమ్మట ఆండ్రూ అన్నాడు. "సరే, నన్ను మీరు అనుసరించ లేకపోతే నేను క్రొత్త భాగస్థులతో ఒక బృందాన్ని కల్పించుకొని మరొక ప్రత్యేక సంస్థను ప్రారంభించవలసి వుంటుంది."

"అహహ అది కాదు ఆండీ! నేను నీ పథకంలో కొంత పెట్టుబడి పెట్టననటం లేదు. మిగిలిన మనవారుకూడా అందులో కొద్ది కొద్దిగా పెట్టుబడి పెడతారు. కాని మన ప్రస్తుతసంస్థ ఈ పనికి పూనుకొనడం నాకు ఇష్టంలేదు. అంతే" అన్నాడు. వెంటనే అందుకొని టామ్.

"బహుశ: నీ వన్నది సమంజస మైనదే కావచ్చు" నని ఆండ్రూ అంగీకరించాడు:

అందువల్ల అతడు మరొక క్రొత్త బృందాన్ని సమకూర్చుకున్నాడు. హోమ్‌వుడ్ ఇరుగు పొరుగు లైన్ కోల్మన్ స్టువార్టులు, రైలురోడ్డు కార్యకర్తలయిన థామ్సన్, స్కాట్‌లు ఆరబెట్టిన సరుకుల గుత్తవ్యాపారం మెక్కాన్డ్‌లెస్ లు ఉన్నారు. వీరందరిలో మెక్కాన్డ్‌లెస్ ప్రధానభాగస్థుడు కార్నెగీ కుటుంబం పూర్వం రెబెక్కా వీథిలో అతి దారిద్ర్యదశను అనుభవిస్తున్న దినాల్లో ఆంట్ ఐట్కిన్ ద్వారా మెక్కాన్డ్‌లెస్ వారికి అప్పు కావలసివస్తే ఇస్తానని మృదువుగా కబురు చేశాడు. అప్పుడు ఆఅప్పు అవసరం లేదని చెప్పటం జరిగింది. కానీ, ఆ సమయంలో మెక్కాన్డ్‌లెస్