పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/133

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓహెయో నదిమీద కట్టవలసిన రెండు బ్రిడ్జీలకు సంబంధించిన కాంట్రాక్టులను అతడికి అమ్మివేశాడు. చికాగోలో స్లీపింగ్ కార్లను ఉత్పత్తి చేస్తున్న జార్జి యం. పుల్మన్‌ను కలుసుకొన్నాడు. మనుష్యస్వభావం పరిశీలన విషయంలో కించిత్తయినా రోషం లేని తన సహజావబోధ శక్తితో అతనికున్న వ్యాపారిక మహత్తును గుర్తించాడు. కార్నెగీ సహచరులు అతనితో "మనం పుల్మన్ మీదస్వత్వోల్లంఘనం Infringement చేసినందుకు అభియోగం తీసుకురావా" లని తీవ్రదోరణిలో మాట్లాడారు.

"నా అభిప్రాయం అదికాదు. అభియోగాలు న్యాయస్థానంచుట్టూ ఎలా త్రిప్పుతాయో మీకు తెలుసు . డబ్బంతా న్యాయవాదుల పాలు కావటమే జరుగుతుంది. పుల్మన్‌కు చికాగో కార్యస్థానం కావటంవల్ల ఆతనికి మధ్య పశ్చిమ, దూర పశ్చిమ రైలుమార్గాలతో మనకంటే ఎక్కువ సాన్నిహిత్య మున్నది. అందువల్ల అతడికి మంచి అవకాశం, అంతే కాక ఆ యువకుడు పరిశ్రమ రంగంలో ఘనకార్యాల నెన్నింటినో నిర్వర్తింప నున్న అదృష్టశాలి. చేతనయితం మనం అతనితో చేతులు కలుపుదాం" అని కార్నెగీ వారి అభిప్రాయంతో వ్యతిరేకించాడు.

సెయింట్ వికొనిస్ హోటల్ మెట్లముందు 1869 లో ఒక వేసగి సాయంకాలం కార్నెగీ, జార్జి పుల్మన్ దరిదాపుగా ప్రక్క ప్రక్కన నడుస్తున్నప్పుడు అదృష్టదేవత చిరునవ్వు