పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/123

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసినవాడు. ఎన్నో దృశ్యాలను దర్శించినవాడు. చరిత్ర, భూగోళ విజ్ఞానాలంటే ఆసక్తి గలవాడు టైలర్ వంటి అనుభవాలు తనకుకూడా లభించాలని కుతూహలపడ్డాడు. ఒక రోజున అతడు జాన్ వావ్‌డివోర్టుతో అన్నాడు. "ఇప్పటి నుంచి నీవు మూడువందల డాలర్లలను కూడబెట్టుకొని నాతో పాటు యూరఫ్‌లో పాదయాత్ర చేయటానికి ఖర్చు చేస్తావా?"

"చేస్తావా?" అన్నాడు ఆండీ "బాతు ఈదుతుందా? ఐరిష్‌వాడు వుర్ల గడ్డలు తింటాడా?

అనుక్షణం నూనెషేర్ల విలువ రాకెట్లలా పైకిపోతున్నది. జాన్ సలహామీద కార్నెగీ 'బ్లాక్ గోల్డు'లో పెట్టుబడిపెట్టాడు. అది అతివేగంగా ఎంతో డబ్బు నిచ్చింది. వీళ్లు ఇద్దరూ హారీఫిప్స్‌ను ఆహ్వానించారు. అతని కిప్పుడు వీళ్ళతో వెంట వచ్చేందుకు కావలసిన డబ్బున్నది. వసంతారంభంలో స్టీమ రెక్కారు.

సంవత్సరాలు గడుస్తున్నకొద్ది కార్నెగీ మధ్య మధ్య దీర్ఘమైన సెలవలు పుచ్చుకుంటూ, ధనాన్ని పెంపొందించుకుంటూ, పెద్ద పారిశ్రామిక సామ్రాజాన్ని నిర్మించుకుంటూ,న్నాడు. పెట్టిన సెలవలను విశేషంగా దేశాటనతో గడిపివేస్తున్నాడు. అతడు రచనల్లో, ప్రసంగాలలో, చేసేచేతల్లో తన జీవితానికే కాదు ఏ మానవుని జీవితానికైనా ప్రధాన లక్ష్యం ఇనుము, లేదా ఉక్కు, లేదా మరొకటి ఏదైనా