పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/114

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేస్తామని అంగీకరించారు. రైల్‌రోడ్ కంపెనీవారి ఉన్నతోద్యోగి నదిని దాటవలసిన ప్రదేశాన్ని పరిశీలించటానికనివచ్చి అక్కడ పడవేసివున్న పోత యినుము దూలాలను చూసి ఆశ్చర్యంతో అన్నాడు. "ఇవి ఓహియో నదిమీద వెళ్ళవలసిన బండ్లను మోయటం ఎలా వున్నా తమ బరువును తాము మోసుకోగలవని నేను భావించటంలేదు."

కానీ అతడు పొరబడ్డాడు. దాన్ని తిరిగి కావలెనని తీసి వేసేటంతవరకూ ఆ వంతెన అనేక సంవత్సరాలు రైలు బండ్ల రాకపోకలకు తట్టుకున్నది. ఏమైనా బ్రిడ్జీ కంపెనీ ఈ పని చేసిన కొద్దికాలం తరువాతనుంచి వంతెనలను నిర్మించటానికి దుక్క ఇనుమునే ఉపయోగించింది. మొదట పై అర్ధచంద్రాకారాలకు (Chords) తరువాత మిగిలిన మరికొన్ని భాగాలకు ఈ దుక్క ఇనుమును ఉపయోగించారు.

పెట్టుబడిదారులు ఎంతో లాభం వస్తుందనుకున్నారు. కానీ కరెన్సీకి ఉల్బణం రావటం వల్లను, యుద్ధ సమయం కనుకను ఖరీదులు విరివిగా పెరిగిపోయినవి. వారి ఆ యవ్యయ పట్టికలో తుది పంక్తిని ఎర్ర సిరాతో వ్రాయవలసి వచ్చింది. అంటే ఏమీ మిగల లేదన్న మాట! ఈ పరిస్థితిని గమనించి పెన్సిల్వేనియాలోన అధ్యక్షుడు ఎక్గాథామ్‌సన్, తన స్వంత బాధ్యతమీద, కీస్టోన్ కంపెనీకి నష్టం లేకుండా మరికొంత అదనంగా మంజూరు చేయించాడు. అతి తీక్షణమయిన కృత జ్ఞతాదృష్టి గల కార్నెగీ ఈ కారణం వల్లనే తరువాత పది