పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఆ అప్పు ఇదివరకే తీర్చావుగదా" అన్నది సమాధానంగా.

"ఇచ్చిన 'ఇంట రెష్టు'తో [ప్రీతి, వడ్డీ అని శ్లేష] నేను సంపూర్ణంగా తృప్తి చెందాను."

"వెనక వడ్డీమాత్రమే చెల్లించాను. ఇప్పుడు అసలు ఇచ్చి వేయగల స్తోమత నాకు వచ్చింది" అన్నాడు. అభ్యంతరం చెపుతూ.

"ఆండ్రా, అసలు సంగతి పెట్టుకోకు"అన్నది. ఆ హాస్య సన్నివేశానికి అనుగుణంగా కళ్ళు మిలమిలలాడిస్తూ. "ఉన్న దున్నట్లుగానే అది చాలా మంచి పెట్టుబడి".

అందువలా "ఇంట రెష్టు" క్రింద [ప్రీతి, వడ్డీ అనిశ్లేష] చెల్లింపులు నడుస్తూనే వచ్చాయి.

ఇంటి విషయానికి వస్తే ఆ 18-2 వేసగి ఫెడరల్ ప్రభుత్వానికి తృప్తికరంగా లేదు. యుద్ధభూమిలో దానికి చుక్కెదురుగా వుంది. యుద్ధఫలితాన్ని గురించి తీవ్రమైన అనుమానాలు ప్రారంభమయినాయి. స్కాట్లండులో ముఖ్యంగా డన్ఫ్‌ర్మ్‌లైన్‌లోకూడా అభిప్రాయం దక్షిణానికి అనుకూలంగా వుంది. అది విని కార్నెగీ విస్తుపోయాడు. యూనియన్ అనుసరిస్తున్నది సన్మార్గమని తెలియజెపుతున్న అంకుల్ లాడర్ ఆ ప్రాంతంలో ఒక్కడై నిలువవలసి వచ్చింది.

తిరిగి జబ్బుచేయటంవల్ల ఆండ్రూ అంకుల్ లాడర్ ఇంట్లో కొన్నివారాలు గడపవలసివచ్చింది. వా ళ్ళిరువురూ అమెరికన్ వ్యవహారాలను గురించిఎన్నో చర్చలు చేశారు.