ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడ్డాకుల లక్ష్మీనాయుడు

స్వతంత్ర : నాగూరు నియోజకవర్గం, వయస్సు: 45 సం లు, 10 సం లుగా శ్రీకాకుళం జిల్లాలో అనేక సంఘాలు స్థాపించి అందలి కొండజాతులవారి అభివృద్ధికై నిరంతరకృషి. ప్రత్యేక అభిమానం: వెనకబడిన జాతుల ఉద్ధరణ. అడ్రస్సు: తాడికొండ, గుమ్మలక్ష్మీపురం పోష్టు.

పెద్దింటి రామస్వామి నాయుడు

కాంగ్రెసు : బలిజిపేట నియోజకవర్గం, జననం: 31-12-1905; విద్య: యం.ఏ. (ఆనర్సు) 1945 నుండి కాంగ్రెసు సభ్యుడు, బొబ్బిలి తాలూకా కాంగ్రెసు అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెసు ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సభ్యుడు, బొబ్బిలి తాలూకా చెరుకుపంటదారుల సంఘము అధ్యక్షుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యుడు, ఇదివరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గ సభ్యుడు. ప్రత్యేక అభిమానం: సారస్వతము, గ్రంథరచన. కర్షకచక్రవర్తి (పద్యకావ్యము) అప్పకవీయ విషయపరిశోధన, శ్రీనాథుని కళాప్రావీణ్యము, గ్రంధకర్త. అడ్రస్సు: పిరిడి పోష్టు, బొబ్బిలి తాలూకా.


నిచ్చర్ల రాములు

కాంగ్రెస్ : బ్రాహ్మణతర్ల నియోజకవర్గం, జననం: 1935 సంవత్సరం విద్య: ఇంటర్ మీడియట్ 1942లో రాజకీయాలలో ప్రవేశం, 1947లో పళాసాలో నడప బడిన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ ఆహ్వాన సంఘ కార్యదర్శి, తాలూకా కాంగ్రెస్ సహాయ కార్యదర్శి, 1945-51 వరకు జిల్లా కాంగ్రెస్ సభ్యుడు తరువాత కృషికార్ లోక్ పార్టీ టెక్కలి తాలూకా కార్యదర్శి 1945-53 సహకార పరపతి సంఘం, సహకార విక్రయ సంఘం డైరక్టరు 1953 నుండి పళసా మేజరు పంచాయితీ అధ్యక్షుడు. ప్రత్యేక అభిమానం: సాంఘికసేవ, అడ్రస్సు: పళాస.

చెలికాని శ్రీరంగనాయకులు

కాంగ్రెసు: వుణుకూరు నియోజకవర్గం, జననం: 28-1-1900, విద్య: బి.ఏ. బి.యల్., 1924 సం నుండు న్యాయవాదవృత్తి, 1952 రాజాం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. 1932-34 వరకు పాలకొండ తాలూకాబోర్డు అధ్యక్షుడు, 1935-38 బొబ్బిలిజిల్లాబోర్డు అధ్యక్షుడు, ఇదివరలో విశాఖపట్టణం జిల్లాబోర్డులోను, విశాఖజిల్లా విద్యాసమితిలోను సభ్యుడు, రాజాం సత్యనారాయణ కో ఆపరేటివ్ స్టోర్సు, హైస్కూలు కమిటి, జార్జి కారనేషన్ క్లబ్బుకు అధ్యక్షుడు. ప్రత్యేక అభిమానం: గ్రామసీమల పునర్నిర్మాణం. అడ్రస్సు: రాజాం.